Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. క్లాస్ డైరెక్టర్.. కాంబో కలిస్తే..!

త్వరలో ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 2:45 AM GMT
మాస్ రాజా.. క్లాస్ డైరెక్టర్.. కాంబో కలిస్తే..!
X

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మాస్ రాజా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా ఫుల్ జోష్ అందిస్తుంది. సరైన కథ.. సరైన డైరెక్టర్ ఈ రెండు పడితే మాస్ రాజా బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. తనలో ఉన్న ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్న రవితేజ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంటాడు. త్వరలో ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో రవితేజ సినిమా ఉంటుందని టాక్. గుంటూరు కారం తర్వాత త్రివిక్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయ్యే దాకా బిజీ. ఆ తర్వాత కూడా అట్లీ తో సినిమా చేస్తాడని టాక్. సో అల్లు అర్జున్ ఎలాగు బిజీ కాబట్టి త్రివిక్రం మరో హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఉందట.

ఆల్రెడీ రవితేజ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే కథ రెడీగా ఉందట. మాస్ రాజా ఓకే అంటే త్రివిక్రం వెంటనే సినిమా చేయాలని చూస్తున్నాడు. రవితేజ మాస్ కి.. త్రివిక్రం క్లాస్ టేకింగ్ కలిస్తే సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు ఈ కాంబో గురించి డిస్కషన్ రాలేదు. కానీ ఈసారి ఈ కాంబో సెట్ అయ్యేలా ఉంది. రవితేజ సినిమా అంటే మాక్సిమం 3, 4 నెలల్లో చుట్టేస్తాడు. సో త్రివిక్రం సినిమా చేసినా సరే రవితేజకి పెద్ద టైం పట్టదని చెప్పొచ్చు.

ఒకవేళ రవితేజ బిజీ అంటే త్రివిక్రం లిస్ట్ లో రామ్, నాని ఉన్నట్టు తెలుస్తుంది. రామ్ తో సినిమా అయితే కొన్నాళ్లుగా చర్చల్లో ఉంది. డబుల్ ఇస్మార్ట్ పూర్తైతే త్రివిక్రం ఒక్క కాల్ చేస్తే చాలు రామ్ వచ్చి వాలిపోతాడు. ఇక నానితో కూడా త్రివిక్రం సినిమా ప్లానింగ్ ఉందని టాక్. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఉంటాడని చెబుతున్నారు. నాని, వెంకటేష్ తో త్రివిక్రం మల్టీస్టారర్ ప్లాన్ ఉందట. మరి ఈ సినిమాల్లో ఏది త్రివిక్రం నెక్స్ట్ సినిమా అవుతుందో చూడాలి.