మాస్ రాజా ఇక రిస్క్ వద్దనుకున్నాడా ?
హరీష్ శంకర్ సినిమా అంటే అన్నీ పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో ఉంటాయి.
By: Tupaki Desk | 3 Aug 2024 3:52 AM GMTమాస్ మహరాజ్ రవితేజ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా వరుస ప్రాజెక్ట్ లు చేసుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంటాడు. క్రాక్ తో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ ధమాకాతో మరో బంపర్ హిట్ అందుకున్నాడు. ఐతే ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులు ఫేస్ చేశాడు. ప్రస్తుత రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేయగా అది ఈ నెల 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే సినిమా మాస్ హిట్ కొట్టబోతున్నట్టు అనిపిస్తుంది. హరీష్ శంకర్ సినిమా అంటే అన్నీ పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో ఉంటాయి.
సినిమా కథ కథనాలు గ్లామర్ సాంగ్స్ అన్ని అంశాల్లో అదరగొట్టేలా ఉంది. ఇదే కాదు ఇక మీదట రవితేజ రెండు మూడు సినిమాలు తీసిన దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. రవితేజ ఈ నిర్ణయం తీసుకోడానికి మెయిన్ రీజన్ కొత్త వారితో సినిమా చేయడం వల్ల ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోకపోవడమే అని తెలుస్తుంది. ఈమధ్య రవితేజ పరిచయం చేసిన దర్శకులు ఎవరు అతనికి హిట్ అందించలేదు.
సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ప్రచార చిత్రాలు ఇవన్నీ బాగానే బజ్ తెచ్చినా సినిమాను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే రవితేజ తన డెసిషన్ మార్చుకుని కొత్త దర్శకులకు నో చెప్పాలని డిసైడ్ అయ్యాడట. అందుకే హరీష్ శంకర్ తర్వాత కూడా మరో సీనియర్ డైరెక్టర్ తోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట.
అంతేకాదు ఒకేసారి రెండు మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచడం వల్ల సినిమాల కౌంట్ పెరుగుతుంది కానీ వాటి ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు కంటైన సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమా మీద ఫుల్ ఫోకస్ చేయాలని మాస్ రాజా అనుకుంటున్నాడట. ఐతే కొత్త వారికి ఛాన్స్ లు ఇవ్వకపోతే ఎలా అని అనుకోవచ్చు కానీ వాళ్లకి ఛాన్స్ ఇచ్చి రవితేజ కెరీర్ రిస్క్ లో పడుతుంది అందుకే కొన్నాళ్లు కొత్త వాళ్లతో కాకుండా ఆల్రెడీ అనుభవం ఉన్న దర్శకులతో పని చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. ఐతే మరోపక్క నాని కొత్త దర్శకులతో సూపర్ హిట్లు కొడుతున్నాడు. నానికి కుదిరినట్టు రవితేజకు ఎందుకు కుదరట్లేదు అంటే నాని సినిమాలన్నీ ఎమోషనల్ కథలే. అందుకే అవి బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి కానీ రవితేజతో మాస్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి దర్శకులు ఫెయిల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇక ఎప్పటికీ రవితేజ కొత్త దర్శకులతో చేయడా అంటే చేస్తాడు అదిరిపోయే కథ.. స్క్రీన్ ప్లే అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే తప్పకుండా చేస్తాడని చెప్పొచ్చు.