Begin typing your search above and press return to search.

ఇష్టంగానే అశ్లీల వీడియోలు.. నోరు విప్పిన మస్తాన్ సాయి!?

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన రాజ్ తరుణ్ – లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయి అరెస్టయ్యాడు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 7:27 AM GMT
ఇష్టంగానే అశ్లీల వీడియోలు.. నోరు విప్పిన మస్తాన్ సాయి!?
X

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన రాజ్ తరుణ్ – లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. గత కొద్ది రోజులుగా ఈ కేసు చుట్టూ అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని వద్ద హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు దాదాపు 200కు పైగా వీడియోలను గుర్తించారు. ఇక ఈ వీడియోల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వీటిలో ఎవరి వీడియోలు ఉన్నాయో? ఎలా రికార్డ్ చేశాడో? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు. ఈ కేసు ముదురుతున్న వేళ లావణ్య కూడా, మస్తాన్ సాయి తన జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించింది. తనపై లైంగిక దాడికి గురిచేసిన వీడియో కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఉందని పోలీసులకు లావణ్య తెలిపింది. అంతేకాదు, మస్తాన్ సాయి మరికొందరు యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి, వారి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.

ఇందులో టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖుల వీడియోలు కూడా ఉన్నాయనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అనుమానాల మధ్య మస్తాన్ సాయి చివరకు నోరు విప్పాడు. పోలీసుల విచారణలో తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని చెప్పాడు. ‘‘ఆ వీడియోలలో ఉన్నవారు ఎవరో కాదు, నా భార్య, కొన్నింటిలో నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. వారు స్వచ్చందంగా నాకు సహకరించారు. లావణ్యతో నాకు గతంలో మంచి సంబంధం ఉండేది. కానీ ఇప్పుడు తనపై ఉన్న సాక్ష్యాలను అడ్డగించేలా ఆమె కుట్ర పన్నుతోంది. తనను బాధపెట్టడానికే తప్పుడు కేసులు పెడుతోంది’’ అంటూ పోలీసులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఇక మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే, రాజ్ తరుణ్ - లావణ్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. "రాజ్ తరుణ్ నాతో పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. ఏడేళ్లు కాపురం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అతను నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రాతో కొత్త రిలేషన్ లోకి వెళ్లిపోయాడు. అతని వల్ల నా జీవితమే నాశనమైంది. నాకు నా రాజ్ తిరిగి కావాలి" అంటూ అప్పట్లో లావణ్య మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ ఆరోపణలపై అప్పట్లోనే రాజ్ తరుణ్ స్పందించాడు. "లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట నిజమే. కానీ కొన్ని కారణాల వల్ల దూరమయ్యాను. గత కొన్ని నెలలుగా ఆమె నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను" అంటూ మీడియాకు వెల్లడించాడు. అప్పట్లో ఈ వ్యవహారం మర్చిపోయినా, ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ నేపథ్యంలో మరోసారి ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం మస్తాన్ సాయి ఫోన్, హార్డ్ డిస్క్ నుండి లభించిన వీడియోల విచారణ నడుస్తోంది. అందులో మరికొంతమంది ప్రముఖుల వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వార్తలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. మస్తాన్ సాయి పై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని, పోలీసుల విచారణలో ఇంకా అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి మధ్య అసలు నిజమెంత? అన్నది త్వరలోనే తేలనుంది.