Begin typing your search above and press return to search.

'దేవర' వచ్చే వరకు మత్తు తగ్గేదే లే..!

రూ.12 కోట్ల షేర్‌ ను ఇప్పటికే రాబట్టిన ఈ సినిమా తాజా వీకెండ్‌ కు మొత్తం రూ.15 కోట్ల షేర్‌ కి చేరే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 Sep 2024 9:35 AM GMT
దేవర వచ్చే వరకు మత్తు తగ్గేదే లే..!
X

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు, లో బడ్జెట్‌ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు సైతం భారీ వసూళ్లు రాబడుతూ విషయం తెల్సిందే. గత నెలలో వచ్చిన ఆయ్‌, కమిటీ కుర్రాళ్లు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఈ నెలలో మత్తు వదలరా 2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నాలుగు రోజుల్లోనే రూ.8.5 కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో ఇప్పటికే భారీ స్థాయిలో లాభాలు దక్కినట్లుగా సమాచారం అందుతోంది.

బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మత్తు వదలరా 2 సినిమా పాతిక కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. రూ.12 కోట్ల షేర్‌ ను ఇప్పటికే రాబట్టిన ఈ సినిమా తాజా వీకెండ్‌ కు మొత్తం రూ.15 కోట్ల షేర్‌ కి చేరే అవకాశాలు ఉన్నాయి. యూఎస్ లోనూ ఈ సినిమా ఈ వీకెండ్‌ కి మిలియన్ డాలర్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వచ్చే వీక్ డేస్‌ లోనూ మినిమంగా వసూళ్లు రాబట్టినా నిర్మాతలకు, బయ్యర్లకు భారీ లాభాలు దక్కడ ఖాయం అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం కేవలం మత్తు వదలరా 2 సినిమాకే చెల్లింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సత్య కామెడీ కి ఫిదా అయిన ప్రేక్షకులు సినిమా పై పాజిటివ్‌ రెస్పాన్స్ ఇవ్వడంతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, మహేష్ బాబులు సైతం సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో సినిమాకు వసూళ్లు నమోదు అవుతున్నాయి. పైగా ఈ సినిమా ట్రైలర్ ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించడం వల్ల మంచి క్రేజ్ క్రియేట్‌ అయింది. అందుకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నెల 27న దేవర సినిమా వచ్చే వరకు మత్తు వదిలేలా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

శ్రీ సింహా హీరోగా సత్య ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మత్తు వదలరా సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్ వచ్చిన నేపథ్యంలో సీక్వెల్‌ గా మత్తు వదలరా 2 సినిమా ను తీయడం జరిగింది. ఇప్పుడు సీక్వెల్‌ కి సైతం మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో మరో ఆలోచన, అనుమానం లేకుండా మత్తు వదలరా 3 సినిమా చేసేందుకు దర్శకుడు రితేష్ రానా సిద్ధం అవుతున్నాడు. యూత్‌ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయ్యేలా మంచి కామెడీతో సినిమాను రూపొందించడం ఈయనకు చెల్లింది. అందుకే మత్తు వదలరా 3 సినిమా సైతం భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.