Begin typing your search above and press return to search.

మత్తు వదలరా-2.. అమెరికాలో ఓ రేంజ్ లో..

ఎలాంటి అంచనాలు లేకుండా ఐదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తు వదలరా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 6:19 AM GMT
మత్తు వదలరా-2.. అమెరికాలో ఓ రేంజ్ లో..
X

ఎలాంటి అంచనాలు లేకుండా ఐదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తు వదలరా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎం ఎం కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ, కమెడియన్ సత్య లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమా.. కామెడీ, సస్పెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ రిలీజ్ కాగా.. అంతకు మించి రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ రివ్యూలతో వరల్డ్ వైడ్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది.

శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన మత్తు వదలరా-2ను కూడా రితేష్ రాణానే దర్శకత్వం వహించారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరో లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్ ఫుల్ పాజిటివ్ గా ఉండటం.. సెలవులు కలిసి రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని అదరగొడుతోంది మత్తు వదలరా-2 మూవీ.

సస్పెన్స్ క్రైమ్ జోనర్ లో వచ్చిన సినిమా.. మూవీ లవర్స్ ను ఫుల్ గా నవ్విస్తోంది. కమెడియన్ సత్య అయితే వేరే లెవల్ లో మెప్పిస్తున్నారు. తన కామెడీతో సినిమాను ముందుండి నడిపించారు. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా మత్తు వదలరా 2 సినిమా ఏకంగా 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. రెండో రోజు వీకెండ్ కావడంతో అంతకు మించి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది.

అమెరికాలో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 300K డాలర్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండు రోజులు కలిపి హాఫ్ మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. 1 మిలియన్ డాలర్ మార్క్ ను కూడా త్వరలోనే అందుకోనున్నట్లు కనిపిస్తుంది. ప్రముఖ ప్రత్యంగిరా ఫిల్మ్స్.. యూఎస్ లో మత్తు వదలరా 2ను రిలీజ్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ మత్తు వదలరా-2 భారీ వసూళ్లు సాధిస్తోంది. థియేటర్లకు ఆడియన్స్ ను రప్పిస్తోంది. వీకెండ్ అండ్ సెలవులు కావడంతో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. సుమారు రూ.16 కోట్లతో మూవీని నిర్మించారని తెలుస్తోంది. రూ.9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. దీంతో మత్తు వదలరా-2 మేకర్స్ కు మంచి లాభాలు అందించి.. పార్ట్ 1కు మించిన హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.