Begin typing your search above and press return to search.

'మట్కా' సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే?

''మట్కా'' సినిమాకి సెన్సార్‌ బోర్డు 'U/A' (యు/ఎ) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. టైటిల్స్‌తో కలిపి మొత్తం 2 గంటల 39 నిమిషాల నిడివి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 Nov 2024 10:42 AM GMT
మట్కా సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ''మట్కా''. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకొని.. ఈ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

''మట్కా'' సినిమాకి సెన్సార్‌ బోర్డు 'U/A' (యు/ఎ) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. టైటిల్స్‌తో కలిపి మొత్తం 2 గంటల 39 నిమిషాల నిడివి వచ్చింది. టైటిల్స్ లేకుండా, దాదాపు 2 గంటల 33 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక మాస్ ఎంటర్‌టైనర్‌కి ఇది సరైన రన్‌టైమ్ అనే చెప్పాలి. ఫస్టాఫ్ 1 గంట 22 నిమిషాలు ఉంటే, సెకండాఫ్ 1 గంట 11 నిమిషాల నిడివి ఉంది. సినిమా కూడా చాలా బాగుందని సెన్సార్ టాక్ ని బట్టి తెలుస్తోంది. రేసీ స్క్రీన్‌ప్లేతో మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుందని, హై ఎనర్జీతో కూడిన రైడ్‌గా ఉంటుందని చెబుతున్నారు.

'మట్కా' ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ బ్లాక్‌తో సహా 4 ఫైట్లు ఉన్నాయి. దాదాపు ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో హై ఇచ్చే ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని, సినిమాకే హైలైట్ అవుతుందని సెన్సార్ టాక్ చెబుతోంది. సెన్సార్ రిపోర్ట్ పూర్తిగా పాజిటివ్ గా ఉండటంతో చిత్ర బృందం ఖుషీగా ఉంది. ఇది కచ్చితంగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మట్కా అని టైటిల్ పెట్టినప్పటికీ, ఆ గేమ్ సినిమాలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఇది హీరో వరుణ్ తేజ్ పోషించిన వాసు జీవితాన్ని చూపిస్తుంది. 16 ఏళ్ళ వయస్సు నుండి 52 ఏళ్ల వ్యక్తి వరకు అతని ప్రయాణాన్ని వివరిస్తుంది. కథంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1958 - 1982 మధ్య కాలంలో జరుగుతుంది. వాసు పాత్రకు తగ్గట్టుగా.. వయస్సు పెరిగే కొద్దీ వాయిస్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్‌లో వైవిధ్యాన్ని చూపించారు వరుణ్ తేజ్. ఇది అతని కెరీర్ లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ లలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ 'పలాస' 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సెన్సిబుల్ సందేశాత్మక చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ''మట్కా'' సినిమాని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు. వరుణ్ తేజ్ ను మాస్ హీరోగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. సలోని, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, సత్యం రాజేష్, జాన్ విజయ్, రవి శంకర్, మైమ్ గోపి తదితరులు కీలక సహాయ పాత్రలు పోషించారు.

కిషోర్ కుమార్ అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కిరణ్ కుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారబోతున్నాయి. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఓవరాల్ గా 'మట్కా' సెన్సార్ రిపోర్ట్ ని బట్టి, వరుణ్ తేజ్ ఈసారి గట్టిగా కొడతాడనే మాట వినిపిస్తోంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న మెగా హీరో.. దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సినిమాపై అతడు ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా.. పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబై చుట్టేసి వచ్చిన వరుణ్.. వైజాగ్ లో సక్సెస్ ఫుల్ గా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇదంతా సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పాలి. సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. గురువారం తెలుగుతో పాటుగా తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది.