Begin typing your search above and press return to search.

మట్కా.. లే లే రాజా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెస్క నెక్స్ట్ రాబోయే మట్కా సినిమా మరొక లెక్క అనేలా ఉంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:16 AM GMT
మట్కా.. లే లే రాజా..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెస్క నెక్స్ట్ రాబోయే మట్కా సినిమా మరొక లెక్క అనేలా ఉంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు కరుణ కుమార్ మేకింగ్ స్టిల్స్ తోనే ఆశ్చర్య పరిచాడు. ఇక మట్కా వాసు పాత్రలో వరుణ్ తేజ్ యొక్క అంకితభావం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయబోతుంది.

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుస అప్డేట్స్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ అందాల తార నోరా ఫతేహీ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన స్టిల్స్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఊహలు రేకెత్తించింది. నోరా ఫతేహీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో కూడా ఆకట్టుకోబోతోంది. ఆడియెన్స్ అంచనాలకు అనుగుణంగా చిత్ర యూనిట్ ఇటీవల 'లే లే రాజా' అనే పాటను డిజైన్ చేసింది. ఫైనల్ గా ఆ పాటను విడుదల చేశారు.

ఈ క్లబ్ సాంగ్ లో నోరా ఫతేహీ తన గ్లామరస్ లుక్స్, సిజ్లింగ్ మువ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెట్రో సెట్టింగ్‌లో రూపొందించిన ఈ పాట సంగీతం, గానం, లిరిక్స్ అన్నీ 70ల, 80ల కాలం వైభవాన్ని గుర్తు చేస్తాయి. జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అంధించారు.

నీతి మోహన్ అందంగా పాడిన ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. నోరా స్టైల్‌కి తగ్గట్టుగా ఆ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ దృశ్య రీతిలో అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట విడుదలతో సినిమా ప్రమోషన్ మరింత వేగం పుంజుకుంది. ఎంతో వైభవంగా తెరకెక్కుతున్న 'మట్కా' చిత్రంలో ప్రతీ సాంగ్ చాలా కీలకంగా ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.

ఇక విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమా కంటెంట్ పై నమ్మకాన్ని కలిగించాయి. వరుణ్ తేజ్ తన నటనలో కొత్తగా కనిపించబోతున్న ఈ సినిమాలో, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు, సినిమా అనుభూతిని పండించేలా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. 'మట్కా'ను ఎస్.ఆర్.టీ. ఎంటర్టైన్మెంట్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.