కాకినాడ పోర్ట్ లోకి అడుగుపెట్టిన మట్కా కింగ్
అందుకే ఈ సారి జోనర్ మార్చి ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న పీరియాడిక్ మాస్ యాక్షన్ కథాంశంతో వరుణ్ తేజ్ మూవీ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 23 Aug 2024 1:55 PM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి చివరిగా వచ్చిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమాల ఇంపాక్ట్ వరుణ్ తేజ్ మార్కెట్ పైన పడిందని చెప్పొచ్చు. అందుకే ఈ సారి జోనర్ మార్చి ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న పీరియాడిక్ మాస్ యాక్షన్ కథాంశంతో వరుణ్ తేజ్ మూవీ చేస్తున్నాడు. మట్కా టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో వరుణ్ తేజ్ ఉన్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడంట. యంగ్ లుక్ తో పాటు మిడిల్ ఏజ్ గ్యాంగ్ స్టార్, అలాగే ఒక మాఫియా డాన్ గా అతని క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుందంట.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1958 నుంచి 1985 మధ్యలో జరిగే కథగా ఈ సినిమా కథాంశం ఉంటుందంట. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన కీలక షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో పూర్తి చేశారు. ఇప్పుడు మూవీ కొత్త షెడ్యూల్ కాకినాడ పోర్ట్ లో మొదలైందంట. పోర్ట్ తో పాటు కాకినాడ సిటీ బ్యాక్ డ్రాప్ లో కీలక యాక్షన్ ఘట్టాలని కరుణ కుమార్ చిత్రీకరించబోతున్నారంట. తాజాగా ఈ షెడ్యూల్ గురించి చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
కాకినాడ పోర్ట్ లో సూట్ ధరించి చేత్తో గన్ పట్టుకొని వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టార్ గా నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇది వరకు గద్దలకొండ గణేష్ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరల మట్కా చిత్రంలో అలాంటి గ్రే షేడ్స్ ఉన్న రోల్ లోనే కనిపించబోతున్నాడంట. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావలని మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు.