Begin typing your search above and press return to search.

మ‌త్తెక్కిస్తోన్న మాజీ మిస్ వ‌రల్డ్!

తాజాగా మానుషీ మ‌రోసారి మంట‌లు రేపింది. బీచ్ ఒడ్డున పింక్ బికీనిలో మండే ఎండ‌లో మంట‌లు రేపుతోంది. కాలే ఎండ‌లో ఇసుక పై ట‌ర్కీ ల‌వ‌ల్ ప‌రిచి అమ్మ‌డు సేద తీరుతుంది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:44 PM GMT
మ‌త్తెక్కిస్తోన్న మాజీ మిస్ వ‌రల్డ్!
X

మాజీ మిస్ వ‌ర‌ల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్ల‌ర్ సుప‌రిచితురాలే. ఇప్పుడిప్పుడే న‌టిగా బిజీ అవుతోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో 'సామ్రాట్ పృధ్వీరాజ్' లో క‌నిపించింది. కానీ అమ్మ‌డికి డెబ్యూ ఆశించిన ఫ‌లితా న్నివ్వ‌లేదు. అటుపై న‌టించిన 'గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ' కూడా నిరాశ‌న‌మే మిగిల్చింది. అయినా ఆ వైఫ‌ల్యాలేవి మానుషి కెరీర్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. కొత్త అవ‌కాశాలు అందుకుంటూనే ఉంది.


ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న 'ఆప‌రేష‌న్ వాలంటైన్' లో..మ‌రో రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనే అంతే యాక్టి వ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కించే ఫోటోల‌తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. ఫ్యామిలీతో వెక‌ష‌న్ కి వెళ్లినా..ఒంట‌రిగా నేచుర్ ని ఆస్వాదిస్తున్నా మానుషీ ఆ నేచుర్ లో క‌లిసి అందాలు విందు చేస్తుంటుంది.


మోడ‌లింగ్ లో ఓ వెలుగు వెలిగిన భామ కాబ‌ట్టి అందాలు విందులో ఎంత మాత్రం వెన‌క‌డుగు వేయ‌దు హ‌ర్యానా బ్యూటీ. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగుతూనే ఉంది. తాజాగా మానుషీ మ‌రోసారి మంట‌లు రేపింది. బీచ్ ఒడ్డున పింక్ బికీనిలో మండే ఎండ‌లో మంట‌లు రేపుతోంది. కాలే ఎండ‌లో ఇసుక పై ట‌ర్కీ ల‌వ‌ల్ ప‌రిచి అమ్మ‌డు సేద తీరుతుంది. ఎండ వేడిని త‌ట్టుకునే లా అంబ్ర‌ల్లా సెట్ చేసుకుంది.


'పరిపూర్ణ ఉదయం. స‌ముద్రంలో ఈత కొట్ట‌డం... అదే స్పాట్ లో మంచి పుస్త‌క పఠనం.. మంచి ఆహారం తీసుకుంటూ వెకేష‌న్ ఆస్వాదిస్తున్నా అంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మానుషీ అందాల్ని ఆస్వాదిస్తూ అభిమానులు అంతే హాట్ గా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మాల్దీవుల్లో ఎండ కూడా నీ అందాల‌కి కూల్ గా మారిపోతుందంటూ ఓఅభిమాని పోస్ట్ చేసాడు.