ఆఫ్ సీజన్ లో వస్తున్న మజాకా గట్టెక్కుతుందా?
ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది చాలా ముఖ్యం. మంచి రిలీజ్ డేట్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఆధారపడుతున్న నేపథ్యంలో మజాకాకు సోలో రిలీజ్ డేట్ అయితే దొరికింది.
By: Tupaki Desk | 23 Feb 2025 2:30 PM GMTఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది చాలా ముఖ్యం. మంచి రిలీజ్ డేట్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఆధారపడుతున్న నేపథ్యంలో మజాకాకు సోలో రిలీజ్ డేట్ అయితే దొరికింది. కానీ ఫిబ్రవరి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వచ్చే సినిమాలకు సరైన ఆదరణ దక్కదు. ఈ మధ్య కాలాన్ని ఇండస్ట్రీకి చెందిన వారంతా డ్రై సీజన్ గా భావిస్తుంటారు.
ఇలాంటి టైమ్ లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా మూవీ రిలీజవుతుంది. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా మజాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రై సీజన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ పెద్దగా థియేటర్ల వైపు చూడరు. వీటన్నింటినీ అధిగమించి మజాకా వర్కవుట్ అవాలంటే సినిమాలో కంటెంట్ చాలా ఎంగేజింగ్‌గా ఉండాలి.
ట్రైలర్ అయితే కామెడీతో ఎంటర్టైనింగ్ గా బాగానే ఉంది కానీ డ్రామా మాత్రం రెగ్యులర్ గానే ఉంది. ఇలాంటి కంటెంట్ తో సినిమా నెట్టుకురావాలంటే కచ్ఛితంగా మౌత్ టాక్ బాగా రావాల్సిన పరిస్థితి ఉంది. సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే ఈ సీజన్ లో ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలా కష్టం. ఇదే సీజన్ లో రిలీజైన తండేల్ మంచి కంటెంట్ తో రిలీజైంది కాబట్టే సూపర్ హిట్ గా నిలిచింది.
ఏదేమైనా మాజాకా సినిమాకు రిలీజ్ టైమ్ మాత్రం చాలా పెద్ద పరీక్షగా మారింది. అయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. మజాకా ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుందని, ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్రమోట్ చేస్తుంది. రావు రమేష్, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ప్రసన్న కుమార్ బెజవాడ్ కథ అందించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.