విజయ్ కొత్త పార్టీ పేరు.. దాని అర్థం ఏమిటంటే..
ఇదిలా ఉంటే విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ పార్టీ పేరుకు 'తమిళ విక్టరీ క్లబ్' అనే అర్థం వస్తుంది.
By: Tupaki Desk | 2 Feb 2024 2:34 PM GMTకోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాట అంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్. కేవలం తమిళంలోనే కాదు సౌత్ లోనే ఊహించని స్థాయిలో ఈ హీరోకి ఫ్యాన్ బేస్ ఉంది. గత ఏడాది 'లియో' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఆ వార్తలను నిజం చేస్తూ తలపతి విజయ్ తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పార్టీకి 'తమిళగ వెట్రి కజగమ్' అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ పార్టీకి విజయ్ అధ్యక్షుడిగా ఉండనున్నారు. సమాజంలో మార్పు రావాలంటే అభిమాన సంఘం మాత్రమే సరిపోదని, రాజకీయ రంగంలో దిగాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
సమాజంలో మార్పు కోసమే రాజకీయ పార్టీ స్థాపించానని పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కజగమ్ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా విజయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ పార్టీ పేరుకు 'తమిళ విక్టరీ క్లబ్' అనే అర్థం వస్తుంది.
పార్టీ పేరులోనే సక్సెస్ ఉండడంతో కచ్చితంగా విజయ్ రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత తన 69వ ప్రాజెక్ట్ ని DVV దానయ్య తో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తమిళ అగ్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విజయ్ చేయబోయే చివరి చిత్రం. ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ సినిమాలకు పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.