పొట్టి..పొడవు కొలమానం కానే కాదు!
హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కొలమానాలు ఉండాలి? అన్నది ఒకప్పటి మాట. హైట్..వెయిట్..కటౌట్ ఇలా అన్ని సరిగ్గా ఉండాలి
By: Tupaki Desk | 26 April 2024 2:30 AM GMTహీరోయిన్ అవ్వాలంటే కొన్ని కొలమానాలు ఉండాలి? అన్నది ఒకప్పటి మాట. హైట్..వెయిట్..కటౌట్ ఇలా అన్ని సరిగ్గా ఉండాలి. అంతకు ముందు మోడలింగ్ చేసి ఉండాలి. యాడ్స్ లో అనుభవం ఉండాలి. కెమెరా ని ఫేస్ చేసిన అనుభవం ఉండాలి అని! ఇలా కొన్ని సమీకరణాలుండేవి. ముఖ్యంగా హైట్ అనేది కీలకంగా ఉండేది. అలాంటి వారికే ఎక్కువగా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడా కొలమానం ఎక్కడా లేదనిపిస్తుంది.
కొంత మంది భామలు అవేం లేకుండానే పాన్ ఇండియాలో సంచలమవుతోన్న వైనం చూస్తూనే ఉన్నాం. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ ఎలా అయిందో ? అందరికీ తెలిసిందే. కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై టాలీవుడ్ లో చిన్న సినిమాతో లాంచ్ అయింది. ఆ సక్సెస్ తో అంచలంచెలుగా ఎదిగింది. `పుష్ఫ`తో పాన్ ఇండియాలో పరిచయమైంది. అటుపై బాలీవుడ్ అవకాశాలు..ఇదే క్రమంలో `యానిమల్` లాంటి బ్లాక్ బస్టర్ పడటంతో? ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే? రష్మిక హైట్ భారీగా ఉండదు.
ఆరడుగులేం కాదు. కానీ నేడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటోన్న స్టార్ హీరోయిన్. ఇక బాలీవుడ్ లో చిన్న వయసులోనే ఉత్తమ నటిగా అవార్డులు రివార్డులు అందుకుంది అలియాభట్. తాను ఆ స్థాయికి చేరుతుందని ఏనాడు కల కూడా కనలేదు. నటిగా కెరీర్ ప్రారంభించింది. సక్సెస్ అయింది. అప్పటికే బాలీవుడ్ లో ఎంతో టప్ కాంపిటీషన్ ఉంది. అయినా అదెక్కడా పట్టించుకోకుండా ముందుకు సాగి జాతీయ ఉత్తమ నటిగా వెలుగులోకి వచ్చింది.
అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కృతి సనన్ తొలుత తన హైట్ కారణంగా అవకాశాలు రావేమో అన్న సందేహ ఉండేది. ఆ కారణంగానే బాలీవుడ్ లో అవకాశాలు ఆలస్యమవుతున్నాయా? అనే బెంగ ఉండేది. అదే సమయంలో సుకుమార్ వన్ సినిమాకి గాను ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసి ఆమె బెంగని తొలగించాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలైంది. నేడు జాతీయ ఉత్తమ నటిగా నీరాజనాలు అందుకుంటోంది.