మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 - హై వోల్టేజ్ విశ్వక్
విశ్వక్ సేన్ పాత్రలో హై వోల్టేజ్ వైబ్ తో కూడిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లతో ఆయన పాత్రకు ఉన్న ట్రయాంగులర్ లవ్ స్టోరీ కూడా ట్రైలర్‌లో ఆసక్తిని కలిగిస్తోంది.
By: Tupaki Desk | 19 Nov 2024 9:16 AM GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని ఇదివరకే నిరూపించాడు. ఈ ఏడాది గామీ - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు చేసిన విశ్వక్ నటుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. అలాగే అతని ప్రతీ సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా మొదట బాక్సాఫీస్ వద్ద టార్గెట్స్ ను ఫినిష్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా విశ్వక్ సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఇదివరకే ఒక ట్రైలర్ విడుదలవగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక నేడు ట్రైలర్ 2.0 విడుదలైంది. రవి తేజ ముల్లపూడి దర్శకత్వంలో రామ్ తళ్ళూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రోమోషనల్ కార్యక్రమాలతో పాటు ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ 1.0 కథలో ఒక వెర్షన్ చూపిస్తే, తాజా ట్రైలర్ 2.0 మరో కోణాన్ని ఆవిష్కరించింది.
రాకీ తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన మెకానిక్ షెడ్ పై ఉన్న అనుబంధాన్ని ప్రదానంగా హైలెట్ చేశారు. అయితే ఈ షెడ్‌ని నాశనం చేయడం, తన తండ్రి అనూహ్య మరణం రాకీ జీవితాన్ని తారుమారు చేస్తాయి. ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించే సునీల్, రాకీ ఎదురెదురుగా వస్తాడు. ఈ క్రమంలో రాకీ న్యాయం కోసం పోరాటం ప్రారంభమవుతుంది. రవి తేజ ముల్లపూడి తన తొలి ప్రయత్నంలోనే కథలో సరైన ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, రొమాన్స్‌ను సమపాళ్లలో మేళవించడంలో సక్సెస్ అయ్యాడు.
విశ్వక్ సేన్ పాత్రలో హై వోల్టేజ్ వైబ్ తో కూడిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లతో ఆయన పాత్రకు ఉన్న ట్రయాంగులర్ లవ్ స్టోరీ కూడా ట్రైలర్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. "నీ మలక్ పేట తెలివితేటలు తీసి ..లో పెట్టుకో" - "బూట్ కాలితో తంతే **కాయలు బయటకు వచ్చేస్తాయి" అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్స్ కూడా హైలెట్ అయ్యాయి. ఈ సినిమాలో సునీల్ ప్రతినాయక పాత్రలో భయానకంగా కనిపించగా, రోడీస్ రఘు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు.
విశ్వక్ సేన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ పాత్రల్లో తగిన ప్రాభావం చూపించారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ కటాసాని అందించిన విజువల్స్ విశేషంగా నిలిచాయి. జేక్స్ బీజాయ్ అందించిన నేపథ్య సంగీతం కథనానికి మరింత ఉత్కంఠను జతచేసింది.
ఇక ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మరోసారి ఈ చిత్రంలో స్పష్టంగా కనిపించాయి. అన్వర్ అలీ ఎడిటింగ్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైన్ పటిష్ఠంగా ఉన్నాయి. ఇక సినిమా విడుదలకు మూడురోజులు మాత్రమే ఉండటంతో, ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచింది. మెకానిక్ రాకీ మూవీ హై ఓల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని మరోసారి విశ్వక్ క్లారిటీ ఇచ్చేశాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.