మెకానిక్ రాకీ గ్లింప్స్.. డేంజర్ కే లైసెన్స్ వీడు!
ఇప్పుడు విశ్వక్ నటిస్తున్న 'మెకానిక్ రాకీ' సౌండ్ మొదలైంది.
By: Tupaki Desk | 28 July 2024 7:04 AM GMTయువ హీరో విశ్వక్ సేన్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక న్యూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందని ఆడియెన్స్ లో నమ్మకం వచ్చేసింది. గామి సినిమాతోనే అతను నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక రెగ్యులర్ గా ఒకే తరహాలో కాకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ పాయింట్స్ ను కూడా టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు విశ్వక్ నటిస్తున్న 'మెకానిక్ రాకీ' సౌండ్ మొదలైంది.
ఇక చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను ఫస్ట్ గేర్ అంటూ విడుదల చేశారు. రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మొదటి సారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రవితేజ ముల్లపూడి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఫస్ట్ గేర్ టీజర్ లో ప్రధాన పాత్రలతో పాటు ఈ చిత్రంలో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టొరీ అని రివీల్ చేశారు.
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గా కనిపించడంతో, అతని పాత్రలో ఉన్న మాస్ యాంగిల్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. "చోటే చోటే బచ్చో కో పూరోం కీ మై జవాబ్ దేతూ..." అనే డైలాగ్ తో పాటు "డేంజర్ కే లైసెన్స్" అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ విశ్వక్ సేన్ డైనమిక్ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తున్నాయి. మీనాక్షి చౌదరి ఎథ్నిక్ వేర్ లో కూల్ గా కనిపిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ ఒక అర్బన్ లేడీ పాత్రలో అలరిస్తున్నారు.
హీరోయిన్ మీనాక్షి విశ్వక్ సేన్ మధ్యలో వచ్చిన సీన్స్ చాలా ఫన్నీగా ఉండడం విశేషం. ఇక మిగతా నటీనటుల పాత్రలు కూడా పవర్ఫుల్ గా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. సునీల్, నరేష్, రోడీస్ రఘురాం పాత్రలు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. అవి ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. రవితేజ ముల్లపూడి ఒక విభిన్నమైన కథతో, విశ్వక్ సేన్ క్యారెక్టర్ ను శక్తివంతంగా ప్రెజెంట్ చేయడం తన డైరెక్షన్ సత్తా చూపిస్తోంది.
ఇక మనోజ్ కటసాని కెమెరా వర్క్ అద్భుతంగా ఉండగా, జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచుతుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా టాప్ క్లాస్ గా ఉంది. మొత్తం మీద ఫస్ట్ గేర్ టీజర్ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు అన్వర్ అలీ ఎడిటర్ గా, క్రాంతి ప్రియమ్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. 'మెకానిక్ రాకీ' చిత్రం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.