Begin typing your search above and press return to search.

మెకానిక్ రాకీ.. కల్లు గిలాసు లంటూ పాట!

విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెకానిక్ రాకీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది

By:  Tupaki Desk   |   8 Aug 2024 5:23 AM GMT
మెకానిక్ రాకీ.. కల్లు గిలాసు లంటూ పాట!
X

విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెకానిక్ రాకీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అక్టోబర్ 31న ఈ చిత్రంలో థియేటర్స్ లోకి రానుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రవితేజ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో మెకానిక్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెకానిక్ రాకీ నుంచి ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ మధ్యకాలంలో తెలంగాణ ఫోక్ బీట్స్ ని సినిమాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణ సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ సాంగ్ కూడా అదే స్టైల్ లో సాగింది. గుల్లెడు గుల్లెడు గులాబీలు అంటూ సాగే ఈ పాటని మంగ్లీ ఆలపించింది. సుద్దాల అశోక్ తేజ చాలా కాలం తర్వాత తన పెన్నుకి పదును పెట్టి మరో పసందైన తెలంగాణ ఫోక్ సాంగ్ ని రాసారు.

పెళ్లి సెటప్ బ్యాక్ డ్రాప్ లో మీనాక్షి చౌదరి పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోని ఉద్దేశించి ఆమె పడుతున్నట్లు పాట ఉంది. అదిరిపోయే మెలోడీ బీట్ తో ఈ సాంగ్ కి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఫిదా, ప్రేమకథ చిత్రాలలో సాయి పల్లవి సాంగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో అందరికి తెలిసిందే. అలాగే ఈ సాంగ్ కూడా పెళ్లిళ్ల సందడిలో గట్టిగా వినిపించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా కనిపిస్తోంది. నెటిజన్లు నుంచి ఈ పాటకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ మూవీ సాంగ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ కావడంతో సినిమాపైన అటెన్షన్ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ రాబోయే సాంగ్స్ ట్రైలర్ మూవీపై ఏ స్థాయిలో ఇంప్రెషన్స్ పెంచుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.