పిక్‌టాక్ : అందాల మేధా క్లీవేజ్‌షో మెరుపులు
12th ఫెయిల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ 'మేధా శంకర్'.
By: Tupaki Desk | 1 Dec 2024 5:38 AM GMT12th ఫెయిల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ 'మేధా శంకర్'. ఆ సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా మేధాకు ఆఫర్లు వస్తున్నాయి. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న మేధా శంకర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో వైరల్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మరోసారి అందాల విందు ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటిలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఈమె సౌత్‌లో ఎప్పుడు నటిస్తుందా అంటూ చర్చ మొదలైంది.
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ బీచమ్ హౌస్‌తో మొదటి సారి నటిగా కెమెరా ముందు అడుగు పెట్టింది. 2021లో హిందీ టీనేజ్ మ్యూజికల్ ఫిల్మ్ షాదిస్థాన్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. నటిగా పలు ఆఫర్లు వచ్చినా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడికి 12th ఫెయిల్ సినిమాలో నటించే అవకాశం రావడం, ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా మరిన్ని ఆఫర్లు ఈమెకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో అరుదుగా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేధా శంకర్ తాజాగా మరోసారి తన క్లీవేజ్ షోతో ఆకట్టుకుంది. బ్లాక్ డ్రెస్‌లో క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది. అలా ముందుకు వంగి మరీ తన అందాలను చూపిస్తూ కవ్విస్తున్న మేధా శంకర్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలు రాలేదు. అయితే ఇలాంటి అందమైన ఫోటో షూట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలవడం మాత్రమే కాకుండా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటూ ఉంది.
మేధా శంకర్ కెరీర్ ఆరంభంలోనే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 12th ఫెయిల్ సినిమాలో విక్రాంత్ మాస్సే సరసన శ్రద్దా జోషి పాత్రను చేసిన విషయం తెల్సిందే. సినిమాలోని ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అధికారిణిగా ఎంపిక అయిన సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్, మాట తీరు భలే ఉంది అంటూ ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేశారు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ప్రముఖ హీరోకు జోడీగా ఈమె నటించేందుకు సిద్ధం అయ్యిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.