Begin typing your search above and press return to search.

డౌట్ వస్తే విడగొట్టడమే.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ మరి అంత చులకనా..?

రీసెంట్ గా పెళ్లైన ఓ హీరోయిన్ తన భర్తను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది. దానికి ఆ ఇద్దరు విడిపోతున్నారంటూ నానా హడావిడి చేశారు.

By:  Tupaki Desk   |   5 March 2024 5:30 PM GMT
డౌట్ వస్తే విడగొట్టడమే.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ మరి అంత చులకనా..?
X

సెలబ్రిటీస్ విషయంలో మీడియా చూపించే చొరవ ఎంత అన్నది అందరికీ తెలిసిందే. వారి పర్సనల్ లైఫ్ లో కూడా తొంగి చూసి వారి లైఫ్ లో జరిగే విషయాల మీద వార్తలు.. ఆ తర్వాత చర్చలు ఆ తర్వాత ట్రోల్స్ ఇవన్నీ చేసేందుకు కారణమవుతారు. స్వయంగా వాళ్లేం చెప్పకపోయినా సరే వాళ్ల గురించి తమకు తోచినట్టుగా రాసేస్తుంటారు. ఇక పెళ్లైన ఏదైనా జంట జస్ట్ డౌట్ వచ్చేలా ప్రవర్తిస్తే చాలు వాళ్ల గురించి ఆటాడుకుంటారు.

సెలబ్రిటీస్ పెళ్లిల్ల గురించి.. వారి లైఫ్ లో జరిగే విషయాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అయితే ఈ స్పెషల్ ఫోకస్ లో వారి లైఫ్ లో ఏం జరుగుతుందో తేల్చి చెప్పేస్తుంటారు. రీసెంట్ గా పెళ్లైన ఓ హీరోయిన్ తన భర్తను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది. దానికి ఆ ఇద్దరు విడిపోతున్నారంటూ నానా హడావిడి చేశారు.

తీరా చూస్తే ఆ హీరోయిన్ మళ్లీ తన భర్తని ఫాలో అవుతుంది. ఇలా అన్ ఫాలో కొట్టినంత మాత్రానా వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారని హడావిడి చేయడం మీడియా వంతైంది. అఫ్కోర్స్ అసలు అన్ ఫాలో కొట్టడం వెనుక ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. కానీ విషయాన్ని చెప్పడం కన్నా తేల్చి చెప్పేయడం వల్ల సెలబ్రిటీస్ ఇబ్బందులు పడుతుంటారు.

సెలబ్రిటీస్ ఏం చేసినా మీడియా వారిపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అయితే సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ మీద ముఖ్యంగా వారి వైవాహిక జీవితం మీద చాలా చులకన భావం ఉంటుంది. సోషల్ మీడియా అన్ ఫాలో అయితేనో.. సెలబ్రిటీ జంట విడిగా కనిపిస్తే చాలు వాళ్లిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారంటూ హంగామా చేస్తారు. అసలు అలాంటి ఆలోచన లేని వారికి కూడా వీరి ప్రచారం వల్ల కొత్త సమస్య ఏర్పడేలా ఉంది. ఇక్కడ మీడియా చేస్తున్న కవరేజ్ కన్నా ఆ వార్తని పట్టుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే ట్రోలింగ్స్ ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. మీడియాలో తమపై వచ్చే వార్తలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకు వెళ్లే సెలబ్రిటీస్ కొందరు ఉండగా తమ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఇబ్బంది పడే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే వారు టైం చూసుకుని తమపై వచ్చిన వార్తల గురించి స్పందిస్తుంటారు.