Begin typing your search above and press return to search.

Sr.NTR ఇష్ట‌మైన మ‌న‌వ‌డు ఎవ‌రు? వైవియ‌స్‌కి చిక్కు ప్ర‌శ్న‌!!

అయితే తాను కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హిస్తూ, కొత్త కుర్రాళ్ల‌తో సినిమా తీస్తున్నాను అని... ఇది వేరే స‌మావేశంలో మాట్లాడాల్సిన టాపిక్ అని క‌ట్ చేసారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 6:48 AM GMT
Sr.NTR ఇష్ట‌మైన మ‌న‌వ‌డు ఎవ‌రు? వైవియ‌స్‌కి చిక్కు ప్ర‌శ్న‌!!
X

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వడు, జాన‌కిరామ్ కుమారుడు న‌వ‌త‌రం హీరో ఎన్టీ రామారావుని తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ ఇటీవ‌ల మీడియాలో హాట్ టాపిక్ గా మారారు ఏస్ డైరెక్ట‌ర్ వైవియ‌స్ చౌద‌రి. ఆయ‌న మీడియా మీటింగుల్లో ఎల్ల‌పుడూ సీనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్థావ‌న లేనిదే స్పీచ్ కి ఆరంభం లేదు.. ముగింపు లేదు! ఎన్టీఆర్ పైనా, ఎన్టీఆర్ కుటుంబంపైనా ఆయ‌న ప్రేమాభిమానాలు అంత‌టివి.

అదంతా అటుంచితే.. వైవియ‌స్ చౌద‌రి త‌న కొత్త సినిమా లాంచ్ సంద‌ర్భంగా మీడియా మీట్ లో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిన ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీనియ‌ర్ ఎన్టీఆర్ కి కుటుంబంలో ఇష్ట‌మైన మ‌న‌వ‌డు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న మీడియా నుంచి ఎదురైంది. దీనికి వైవియ‌స్ జ‌వాబు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎన్టీఆర్ గారికి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే ఇష్ట‌మైన మ‌న‌వ‌డు అని ఎవ‌రు చెప్పారు? తార‌క్ ఒక్క‌డే ఇష్టం అంటే వేరే మ‌న‌వ‌ళ్లు అంటే ఇష్టం లేద‌నా అర్థం? అంటూ వైవియ‌స్ ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు.. తార‌క్ కూడా ఎప్పుడూ ఇలా చెప్ప‌లేదు.. అని అన్నారు. ఎన్టీఆర్ గారికి అంద‌రు మ‌న‌వ‌ళ్లు స‌మాన‌మేన‌ని వైవియ‌స్ అన్నారు.

కానీ రామారావు గారు ఆయ‌న పేరును ఎన్టీఆర్ కి పెట్టారు క‌దా? అని మీడియా లాజిక్ లాగ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా వైవియ‌స్ ఖండించారు. త‌న కుమారుల‌కు నంద‌మూరి హ‌రికృష్ణ స్వ‌యంగా పేర్లు పెట్టుకున్నార‌ని వైవియ‌స్ అన్నారు. జాన‌కి రామ్, క‌ల్యాణ్ రామ్, తార‌క్ రామ్ అని హ‌రికృష్ణ గారే పేర్లు పెట్టారని తెలిపారు.

అయితే కొన‌సాగింపు ప్ర‌శ్న‌లు వైవియ‌స్ ని విసిగించాయి. ఒక స‌మావేశంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ గారే త‌న‌కు ఇష్ట‌మైన మ‌న‌వ‌డు రామారావు అని అన్నారు క‌దా? అని ప్ర‌శ్న ఎదురైంది. అయితే తాను కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హిస్తూ, కొత్త కుర్రాళ్ల‌తో సినిమా తీస్తున్నాను అని... ఇది వేరే స‌మావేశంలో మాట్లాడాల్సిన టాపిక్ అని క‌ట్ చేసారు.

దీనికి సోష‌ల్ మీడియాల్లో రియాక్ష‌న్లు ఘాటుగా ఉన్నాయి. ``సీనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా తానే తన అంశలో జన్మించాడని జూనియర్ ఎన్టీఆర్‌కి నామకరణం చేశారు! అని హరికృష్ణ గారు స్వయంగా చెప్పారు. దీనిలో తికమక ఏమి లేదు చౌద‌రి గారూ!`` అంటూ అభిమాని ఒక‌రు పాయింట్ ఔట్ చేసారు. ప్ర‌స్తుతం ఇది సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మారింది.