వాళ్లంతా ఒక్కటైతే...బాలయ్య ఒక్కడే అలా!
ఇలా ఈ ముగ్గురికి ఇండస్ట్రీ అంటే చిన్న వయసు నుంచే అలవాటుంది. నాగార్జున-వెంకటేష్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది.
By: Tupaki Desk | 4 Jan 2025 11:30 AM GMTసీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఒక జనరేషన్ హీరోలు. అప్పట్లో ఆ నలుగురు హీరోల మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ ఉండేది. వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల మధ్య వైరాలు కూడా అలాగే తెరపైకి వచ్చేవి. నాగార్జున నాగేశ్వరరావు వారసత్వంతో ఎంట్రీ ఇస్తే, బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వంతో తెరంగేట్రం చేసారు. ఇక వెంకటేష్ తండ్రి మూవీ మోఘల్ రామానాయుడు పెద్ద నిర్మాత కావడంతో ఎంట్రీ ఈజీ అయింది.
ఇలా ఈ ముగ్గురికి ఇండస్ట్రీ అంటే చిన్న వయసు నుంచే అలవాటుంది. నాగార్జున-వెంకటేష్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. ఈ ముగ్గుర్ని స్టార్ కిడ్స్...గోల్డెన్ స్పూర్ హీరోలుగా పేర్కొంటారు. ఇక చిరజీవి ప్రయాణం వీళ్లకు ఎంతో భిన్నమైనది అన్నది తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నటుడాయన. అలాంటప్పుడు చిరంజీవి ఒక్కడే ఒకవైపు ఉంటే ఆ ముగ్గురు ఒక్కటిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని అంతా అనుకుంటారు.
కానీ ఇక్కడ సీన్ వేరు అని సీనియర్ నటి మీనా మాటల్ని బట్టి తెలుస్తోంది. మీనా ఆ నలుగురు హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. వాళ్లతో మీనాకు మంచి స్నేహం కూడా ఉంది. అయితే నలుగురు సెట్స్ లో ఉండే తీరు వేరుగా ఉంటుందని మీనా అంటున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎంతో క్వైట్ గా ఉంటారుట. మాట్లాడటం చాలా తక్కువగా ఉంటుందట. అవసరమైతే మాట్లాడుతారు తప్ప అనవసరంగా మాట్లాడరని తెలిపారు.
కానీ బాలకృష్ణ అలా కాదు అట. తనతో పాటు అందర్నీ మాట్లాడించే తరహా వ్యక్తి అని అన్నారు. చాలా సరదాగానూ ఉంటారన్నారు. అలాగని మిగిలిన ముగ్గురు సరదాగా ఉండరని కాదు వాళ్లు కూడా బాగా పరిచయమైతే? సరదాగా ఉంటారని..కానీ వాళ్లతో పోలిస్తే బాలయ్య ఇంకా ఫాస్ట్ గా ఉంటారన్నారు. అయితే ఇప్పుడా ముగ్గురిలో ఇద్దరు చిరు-వెంకటేష్ లు బాలయ్య లాగే యమా యాక్టివ్ గా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఆఫ్ ది స్క్రీన్ లోనూ హీరోయిన్లు అందరితో సరదాగా జోకులేస్తూ మాట్లాడుతున్నారు.