Begin typing your search above and press return to search.

'ఐఫా'లో హిందీ అంటే శివాలెత్తిన మీనా!

ఇక ఈ వేడుక‌లో సీనియ‌ర్ న‌టి మీనా కూడా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:45 AM GMT
ఐఫాలో  హిందీ అంటే శివాలెత్తిన మీనా!
X

ఇటీవ‌ల అబుదాబీ లో `ఐఫా` వేడుకలు ఎంత వైభ‌వంగా జ‌రిగాయో? తెలిసిందే. సినీ తార‌ల‌తో అబుదాబీ మెరిసిపోయింది. సెల‌బ్రిటీలంతా ఎంట్రీకి ముందు ఫోటో సెష‌న్ల‌తో అద‌ర‌గొట్టారు. హీరోయిన్లు అంతా ఓరేంజ్ లో మురిపించారు. సోలో గా వ‌చ్చిన వాళ్లు సోలాగా..జంట‌ల‌గా వ‌చ్చిన వారు జంట‌లగా ఫోజులిచ్చారు. ఇక ఈ వేడుక‌లో సీనియ‌ర్ న‌టి మీనా కూడా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

మీనా న‌లుపు వ‌ర్ణం దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబై వ‌న్నే తీసుకొచ్చారు. అయితే అక్క‌డ ఓ జ‌ర్న‌లిస్ట్ మీనాని మీరు హిందీలో మాట్లాడండి అని అడిగారు. దీనికి కౌంట‌ర్ గా మీనా ఇది హిందీ సినిమా పండ‌గ కాదు అంటూ చెప్పారు. `నేను సౌత్ ఇండియన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అటు నార్త్ ఇండియన్, ఇటు సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చింది.

అక్క‌డ ఆ జ‌ర్న‌లిస్ట్ హిందీలో మాట్లాడించి ఇది బాలీవుడ్ పండ‌గ అన్న‌ట్లు హైలైట్ చేయాలి? లేదా హిందీ జాతీయ భాష కాబ‌ట్టి అలా మాట్లాడాల‌ని అడిగిన‌ట్లు అయింది. దీంతో మీనా కూడా ధీటుగా బ‌ధులిచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల న‌టులు ఆ వేడుక‌లో పాల్గొన్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం ఇలా ద‌క్షిణాది నుంచి అంతా హాజ‌ర‌య్యారు.

అన్ని ప‌రిశ్ర‌మ‌ల న‌టుల‌కు అక్క‌డ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జ‌రిగింది.హోస్ట్ చేసింది బాలీవుడ్ అయినా? తారంల‌తా క‌లిస్తేనే అందం. ఈసారి అబుదాబీలో మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా వేడుక జ‌రిగిందంటే? అందుకు సౌత్ ప‌రిశ్ర‌మ‌లు ఎంతో స‌హ‌క‌రిస్తేనే సాధ్యమైంది.