'మీనా కుమారి బయోపిక్' ఇక లేనట్టే!
తాజాగా మిడ్-డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ ఇకపై బయోపిక్‌కి దర్శకత్వం వహించను అని వెల్లడించారు. మీనా కుమారి బయోపిక్ బదులుగా వేరే ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉందని తెలిపారు.
By: Tupaki Desk | 28 Nov 2024 3:15 AM GMTతరచి చూస్తే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. జీవితానుభవాలు ఉంటాయి. వాటన్నిటినీ తెరపై అందంగా చిత్రీకరించే పనితనం దర్శకుడిలో ఉండాలి. ఒక గల్లీ రౌడీ లేదా సామాన్య రైతు జీవితంలోను ఎమోషన్స్ కి కానీ డ్రమటిక్ సన్నివేశాలకు కానీ కొదవేమీ ఉండదు. చూపించే క్రియేటర్ ని బట్టి తెరపై ప్రతిదీ మారుతుంది. అయితే బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా అలాంటి పనిమంతుడు కావాలని కలలుగంటున్నారు. తన సుదీర్ఘమైన ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిని కొన్నాళ్లు పక్కనపెట్టి అయినా దర్శకత్వం వహించాలని నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దానికోసం ఆయన ఒక సెలబ్రిటీ జీవితకథనే ఎంచుకున్నాడు.
ప్రఖ్యాత నటి మీనా కుమారి బయోపిక్ కి దర్శకత్వం వహించాలని భావించారు. చాలా కాలం పాటు దానిపై పని చేసారు కూడా. కానీ ఏమైందో ఇప్పుడు దర్శకత్వం నుండి తప్పుకున్నారు. ఫ్యూచర్‌లో వేరే ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తానని కన్ఫర్మ్ చేశాడు. మీనా కుమారి బయోపిక్ కోసం ఆయన కృతి సనన్ వంటి ప్రతిభావనిని కూడా ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇది పదేపదే వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా ఆపేసారు.
తాజాగా మిడ్-డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ ఇకపై బయోపిక్‌కి దర్శకత్వం వహించను అని వెల్లడించారు. మీనా కుమారి బయోపిక్ బదులుగా వేరే ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉందని తెలిపారు. దర్శకత్వం వహించడం తనకు ఇంకా కలగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. ఫ్యాషన్ డిజైనర్లందరికీ దర్శకత్వంపై ఆసక్తి లేనప్పటికీ సినిమాతో తనకున్న అనుబంధం సహజమని మనీష్ తెలిపారు. తాను చిన్నతనం నుండి సినిమాలను ప్రేమించానని అన్నారు. ముఖ్యంగా మొఘల్-ఎ-ఆజం వంటి క్లాసిక్‌లు .. రాజ్ కపూర్ గురుదత్ రచనలను ఇష్టపడతానని అన్నారు. 70ల నాటి సంగీతం , కాస్ట్యూమ్స్ పై అతడి అభిరుచి చిత్ర పరిశ్రమపై అతడి అవగాహన అద్భుతమైనది.
నిజానికి ఈ బయోపిక్ చాలాసార్లు వాయిదా పడింది. మొదట్లో అక్టోబర్ 2023లో ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ తర్వాత అక్టోబర్ 2024కి ఆపై అక్టోబర్ 2025కి మార్చారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆపేసారు.