'గుంటూరు కారం'.. ఆ పాప ఫ్యాన్స్ కూడా హర్టయ్యారా?
త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం' నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా
By: Tupaki Desk | 8 Jan 2024 6:10 PM GMTత్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం' నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. ఈ ట్రైలర్ మహేష్ ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత మహేష్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ స్క్రీన్ ప్రజెన్స్, పంచ్ డైలాగ్స్ తో పాటు శ్రీలీలతో మహేష్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.
ట్రైలర్లో వింటేజ్ మహేష్ ని చూసి పండగ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ట్రైలర్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరిని కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్ లో చూపించడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. సినిమాలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాకపోయినా మహేష్ మరదలు పాత్ర అంటే ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ ఉండే ఉంటుందని అభిమానుల అంచనా. ట్రైలర్లో తన మామయ్యతో రమణ గురించి చెప్పిన ఒకే షాట్ లో కనిపించింది.
ఇక మహేష్ తర్వాత ట్రైలర్ ల ఎక్కువ ఫోకస్ అయ్యింది మాత్రం హీరోయిన్ శ్రీలీల అనే చెప్పాలి. ఉన్నంతలో ఆమెను బాగానే చూపించారు. ఇందులో మీనాక్షి చౌదరికి ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్ర అయితే దక్కలేదు. ఇదే విషయాన్ని ఆమె గతంలో ఓ సందర్భంలో చెప్పారు. పేరుకి మరదలు పాత్ర అంతే తప్పితే హీరోతో డ్యూయెట్లు, రొమాంటిక్ సీన్లు గట్రా ఉండవు. ఒక గ్రూప్ సాంగ్ తప్పితే మహేష్ తో సింగిల్ సాంగ్ కూడా ఈమెకి లేదట.
కెరీర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో నటించిన మీనాక్షి చౌదరి ఇప్పుడు స్టార్ హీరోలతో జత కడుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు కారం పై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు సినిమాలో మీనాక్షి చేసిన పాత్రని గతంలో శ్రీలీలకి ఇచ్చారు. అది కూడా పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఉన్నప్పుడు. పూజతో కొంత షూటింగ్ కూడా చేశారు.
ఆ తర్వాత అనూహ్యంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా పెట్టి మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఒకవేళ పూజ హెగ్డే కనుక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోకపోయి ఉంటే ఇప్పుడు మీనాక్షి మీద ఆడియన్స్ చూపిస్తున్న సింపతి శ్రీలీల మీదకి వచ్చేదేమో. త్రివిక్రమ్ దాదాపు తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకుంటాడు. కానీ సెకండ్ హీరోయిన్ కి పెద్దగా గుర్తింపు రాదు. 'అఆ' లో అనుపమ పరమేశ్వరన్ ని మినహాయిస్తే మిగతా హీరోయిన్లకు పెద్దగా పేరు రాలేదు.