లెదర్ దుస్తుల్లో మీనాక్షి మురిపం!
సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా మారిన బ్యూటీ మీనాక్షి చౌదరి. అమ్మడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు
By: Tupaki Desk | 13 Jun 2024 6:22 AM GMTసైలెంట్ గా వచ్చి వైలెంట్ గా మారిన బ్యూటీ మీనాక్షి చౌదరి. అమ్మడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ సైలెంట్ గా సంచలనాలు మాత్రం నమోదు చేసింది. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూట్ టాప్ లీగ్ కి అతి చేరువలో ఉంది. ప్రస్తుతం అమ్మడు ఎంత బిజీగా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ రెండు లాంగ్వేజ్ ల్ని కుమ్మేస్తుంది. లైన్ లో ఉన్న ప్రాజెక్ట్ లన్నీ విజయం సాధిస్తే టాప్ లీగ్ లో బెర్త్ ఖాయమే.
ఇప్పటికే అనుష్క, సమంత లాంటి వాళ్లు కూడా టాప్ లీగ్ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో! ఆ వరుస ఖాళీగానే ఉంది. అందుకు తగ్గట్టే మీనాక్షి ఎంపికలు కనిపిస్తున్నాయి. అలాగే నెట్టింట యాక్టివిటీ గురించి చెప్పాల్సి న పనిలేదు. ఇన్ స్టా ద్వారా రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. కొత్త కొత్త ఫోటో షూట్లతో కాక పుట్టించే ప్రయత్నాల్లో వేగం పెంచుతుంది. హార్యానా బ్యూటీ నుంచి వెడెక్కించిన ఫోటో షూట్లు ఎన్నో వైరల్ అయ్యాయి.
తాజాగా అందుకు భిన్నంగా ఈసారి కొత్తగా ట్రై చేసింది. బ్లాక్ లెదర్ దుస్తుల్లో మురిపించే ప్రయత్నం చేసింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో మీనాక్షి మురిపిం మామూలుగా లేదు. లెదర్ కోట్..లెదర్ షూస్ ధరించి జిప్పుల మధ్యలో అందాలన్నింటినీ బంధీని చేసేసింది. సొగసైన చూపుతో ఆకర్షించింది. ఇక అమ్మడు హెయిర్ స్టైల్ సైతం లెదర్ దుస్తులకు మ్యాచింగ్ గానే మలిచింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మీనాక్షి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. రోటీన్ కి భిన్నమైన లుక్ ఇంట్రెస్టింగ్ అంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. మీనాక్షి బ్యూటీకైతే ప్రపోజల్స్ వరద పారుతుంది. ఎవరి స్టైల్లో వారు ప్రపోజ్ చేస్తున్నారు.