మా ఊరి నుంచి తొలి డాక్టర్..యాక్టర్ నేనే!
పాత తరం హీరోయిన్ల సంగతేమో గానీ..నేటి జనరేషన్ హీరోయిన్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తే? దిమ్మ తిరిగిపోతుంది.
By: Tupaki Desk | 29 Oct 2024 7:30 PM GMTపాత తరం హీరోయిన్ల సంగతేమో గానీ..నేటి జనరేషన్ హీరోయిన్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తే? దిమ్మ తిరిగిపోతుంది. ఒక్కొక్కరి బ్యాక్ గ్రౌండ్ షాకింగ్ అనిపిస్తుంది. తల్లిదండ్రులు..తాతలు కోట్లాది రూపాలయ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి మనవరాళ్లకు ప్రేమతో దారాదత్తం చేసినట్లే కనిపిస్తుంది. చదువు దగ్గర నుంచి స్థిరపడ్డ వృత్తి వరకూ వాళ్ల జీవితం..లైఫ్ స్టైల్ అంతా సామాన్యుడి ఊహించలేని విధంగా ఉంటుంది. హీరోయిన్ అవ్వాలంటే ఆ మాత్రం బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరి.
లేకపోతే సినిమా అవకాశాలు అనేది అంత ఈజీ కాదు. మోడలింగ్ మొదలు పెట్టడం అక్కడ నుంచి యాడ్స్ ప్రమోట్ కి అవ్వడం...ఆ రెండింటా రాణించిన తర్వాత సినిమాలకు ప్రమోట్ అవ్వడం. ఇదంతా ఓ ప్రోసస్. కానీ మీనాక్షి చౌదరి జర్నీ మాత్రం వాళ్లకు భిన్నంగా ఉంది. అమ్మడు రిచ్ కిడ్ కాదంటోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయినట్లు తెలిపింది. ఆ సంగతేంటో ఆమె మాటల్లోనే.. ` నాన్న ఆర్మీ ఉద్యోగి.
అమ్మ పదవ తరగతి చదివింది. పంజాబ్ లో నీ ఓ చిన్న గ్రామం మాది. మా ఊరి నుంచి డాక్టర్ అయిన మొదటి అమ్మాయిని నేనే. యాక్టర్ అయిన మొదటి అమ్మాయిని కూడా నేనే. అలా చాలా విషయాల్లో నేను ఫస్ట్. మా ఇంట్లో మొదటి ప్రాధాన్యత చదువకే ఇస్తారు. ఇలాంటి ఊరు నేపథ్యం కాబట్టే నా దగ్గర ఇప్పుడు బాగా డబ్బు ఉన్నా? నాలో ఎలాంటి మార్పు ఉండదు. డబ్బులేని రోజులు చూసాను. డబ్బులున్న రోజులు చూస్తున్నాను.
చాలా భారతీయ కుటుంబాలు ఇలాగే ఉంటాయి. లక్కీ భాస్కర్ కథ నేపథ్యం కూడా ఇలాగే ఉంటుంది` అని తెలిపింది. శ్రీనిధి శెట్టి కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోయిన్ అయింది. సినిమాలపై ఆశతో మోడలింగ్ అటుపై యాడ్లు చేసింది. పేపర్లో అమ్మడి ఫోటో చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్` కి హీరోయిన్ గా ఎంపిక చేసాడు.