Begin typing your search above and press return to search.

ఈ స్టార్ హీరోయిన్ మహేష్ కి పెద్ద అభిమాని..!

లేటెస్ట్ గా ఆమె నటించిన లక్కీ భాస్కర్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా మహేష్ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ మీద తనకున్న అభిమానాన్ని చూపిస్తుంది మీనాక్షి చౌదరి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 9:30 PM GMT
ఈ స్టార్ హీరోయిన్ మహేష్ కి పెద్ద అభిమాని..!
X

ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అనిపించేలా సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నే శాసించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాలే చేసినా మహేష్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలుసు. అందుకే ఆయన గురించి నేషనల్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతాయి. ఇదే క్రమంలో మహేష్ ని ఇష్టపడే వారికి లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో అదరగొడుతున్న మీనాక్షి చౌదరి కూడా మహేష్ బాబుకి పెద్ద అభిమాని. గుంటూరు కారం సినిమాలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మీనాక్షి ఆ విషయాలను ఎప్పుడూ చెబుతూ వస్తుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన లక్కీ భాస్కర్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా మహేష్ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ మీద తనకున్న అభిమానాన్ని చూపిస్తుంది మీనాక్షి చౌదరి.

గుంటూరు కారం లో మహేష్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పింది మీనాక్షి. ఆయన పనికి తాను పెద్ద అభిమానినని అన్నారు. దేశంలో ఉన్న ఉత్త నటులల్లో మహేష్ గారు ఒకరని అన్నది మీనాక్షి చౌదరి. ఐతే గుంటూరు కారం సినిమాలో ఆమె రోల్ చాలా చిన్నది అయినా మహేష్ మీద ఇష్టం తోనే ఆ పాత్ర చేసిందని తర్వాత తెలిసింది.

ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటించిన లక్కీ భాస్కర్ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. లక్కీ భాస్కర్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కచ్చితంగా సినిమా దుల్కర్ తో పాటు మీనాక్షి కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చేలా ఉంది. ఇదే కాదు నవంబర్ లో మీనాక్షి మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నెల రోజుల వ్యవధిలో మీనాక్షి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఏ స్టార్ హీరోయిన్ కి ఇలా వరుస సినిమాల ఛాన్స్ లు రాలేదు. మరి ఈ సినిమాలతో మీనాక్షి టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్ అవుతుందా లేదా అన్నది చూడాలి. మీనాక్షి చౌదరి మాత్రం తన కెరీర్ పై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.