Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం… బొబ్బిలిరాజా టచ్

ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ ‘బొబ్బిలిరాజా’ గెటప్ లో బలపం పట్టి భామ వొళ్ళో పాటకి స్టెప్పులు వేసింది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 11:11 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం… బొబ్బిలిరాజా టచ్
X

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్ కి తగ్గట్లుగానే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు నుంచి సంక్రాంతికి ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇదిలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్ యాక్టివిటీస్ ని అనిల్ రావిపూడి అండ్ కో షురూ చేశారు. ఎక్కడా తగ్గకుండా చాలా క్రియేటివ్ గా ఈ ప్రమోషన్స్ ని చేస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే ఫెస్టివల్ సాంగ్ ని విక్టరీ వెంకటేష్ తో పాడించారు.

దీనిని కూడా చాలా క్రియేటివ్ పద్ధతిలో వీడియో చేసి ప్రమోట్ చేశారు. జనాల్లోకి ఈ సాంగ్ ని స్ట్రాంగ్ గా పంపించారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి కూడా వెంకటేష్ ఇమేజ్, పాత సినిమాలని సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేసింది.

ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ ‘బొబ్బిలిరాజా’ గెటప్ లో బలపం పట్టి భామ వొళ్ళో పాటకి స్టెప్పులు వేసింది. ఈ వీడియోని ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా మేకర్స్ షేర్ చేశారు. నెక్స్ట్ సాంగ్ కి సంబందించిన లీడ్ ఇస్తూ గెస్ చేయాలని నెటిజన్లుని కోరారు. సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే సాంగ్ కూడా బొబ్బిలి రాజా చిత్రంలోనిది రీమేక్ చేశారా అనే డౌట్ ని నెటిజన్లు వ్యక్తం చేశారు.

భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా కోసం ఆయన చేసిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. మరి నెక్స్ట్ ఎలాంటి ఆసక్తికరమైన పాటతో రాబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీనాక్షి చౌదరి ‘బొబ్బిలి రాజా’ గెటప్ పైన మాత్రం నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

కమర్షియల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ లుక్ ని కూడా గతంలో షేర్ చేశారు. దీంతో కాన్సెప్ట్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది.