ప్రయోగాలకు భయపడుతున్న యంగ్ హీరోయిన్
పాత్రల ఎంపిక విషయంలో ప్రయోగాలు చేస్తే అవి ఒక్కోసారి కలిసి రాకపోవచ్చనే భ్రమ కొందరు ఆర్టిస్టుల్లో ఉంది.
By: Tupaki Desk | 2 Dec 2024 4:39 AM GMTపాత్రల ఎంపిక విషయంలో ప్రయోగాలు చేస్తే అవి ఒక్కోసారి కలిసి రాకపోవచ్చనే భ్రమ కొందరు ఆర్టిస్టుల్లో ఉంది. ముఖ్యంగా అందమైన హీరోయిన్‌లు తల్లి, భార్య పాత్రలు పోషిస్తే ఆ తర్వాత మళ్లీ మళ్లీ అవే పాత్రలు వెంటపడతాయనే అపప్రద ఉంది. నిజానికి ఈ తరహా ఔట్ డేటెడ్ థింకింగ్ ఒకప్పటి ప్రజల్లో ఉండేది. మూస ధోరణిలో ఆలోచించే మూర్ఖత్వం నేటితరంలో అసలు లేనే లేదు. టాలీవుడ్ .. బాలీవుడ్.. హాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అయినా.. కంటెంట్ లో వైవిధ్యం, కథ కమామీషు, విజువల్ గ్రాండియారిటీ వంటివి చూస్తున్నారు. తమకు తెలిసిన లేదా తమకు నచ్చిన నటుడు లేదా నటి అయితేనే సినిమా చూడాలని కూడా రూల్ అసలే పెట్టుకోవడం లేదు.
ఇటీవల ప్రేక్షకుల ఎంపిక పరంగా ట్రెండ్ అమాంతం మారింది. పాన్ ఇండియన్ ట్రెండ్ లో ఇప్పుడు ప్రాంతీయ సినిమా అనేదేం లేదు. కంటెంట్ ఉన్న ప్రతి సినిమా పాన్ ఇండియన్ సినిమానే. అన్ని భాషల్లోను మంచి ఫలితం అందుకునే ఛాన్సుంది. ఇక నటీనటుల విషయంలో కూడా ప్రేక్షకులు లోకల్ నాన్ లోకల్ చూడటం లేదు. పైగా ప్రయోగాత్మక పాత్రలతో ఆకట్టుకునే నటీమణులకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. డిజిటల్ విప్లవం.. ఓటీటీల వెల్లువతో సీన్ అంతా మారిపోయింది.
ఇటీవలి కాలంలో హీరోయిన్లు కూడా రూల్స్ పెట్టుకుని నటించేందుకు సిద్ధంగా లేరు. ఎంపిక చేసుకునే పాత్ర ఏదైనా నటనకు ఆస్కారం ఉందా లేదా? అన్నది చూస్తున్నారు. మేల్ స్టార్ కి అనుసంధానంగా ప్రధాన లీడ్ అవునా కాదా? అనేది లీడింగ్ హీరోయిన్లు చూస్తున్నారు. మొన్నటికి మొన్న లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి తల్లిగా, భార్యగా విలక్షణమైన పాత్రలో నటించింది. అంతకుముందు మహేష్, రవితేజ లాంటి స్టార్ల సరసన గ్లామరస్ పాత్రలో నటించిన మీనాక్షి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించడాన్ని జనం హర్షించారు. అయితే తల్లి పాత్రలో నటించాక గ్లామరస్ పాత్రల్లో అగ్ర హీరోలు అవకాశాలివ్వడం లేదని ఈ భామ భావిస్తోందట.
నిజానికి ఆర్టిస్టు అంటే అన్నిరకాల పాత్రల్లో నటించి మెప్పించాలి. ఫలానా అయితేనే చేస్తానని బిగుసుకుని కూచున్నా కష్టమే కదా అని విశ్లేషిస్తున్నారు. అయితే మీనాక్షి కి ఈ సంధికాలం ఒక చిన్న ఫేజ్ మాత్రమే. తన ప్రతిభ, నట వైవిధ్యం కారణంగా మునుముందు ఎలాంటి విలక్షణ పాత్రల్లో అవకాశాలొస్తాయో ఊహించలేం. టైమ్ కోసం కాస్త వేచి చూడాల్సి ఉంటుంది. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ఇలా వచ్చి అలా వెళ్లాయి. వీటిలో ఎలాంటి పాత్రలో నటించినా మీనాక్షికి కలిసొచ్చిందేమీ లేదు. తదుపరి సంక్రాంతి 2025 బరిలో విక్టరీ వెంకీతో కలిసి `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాతో వస్తోంది మీనాక్షి. సీనియర్ హీరో ప్రియురాలిగా మీనాక్షి ఏ మేరకు తన పాత్రను పండిస్తుందో వేచి చూడాలి. అనీల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాలో తన పాత్ర వెయిటేజీ ఎంతో చూడాలి. నటనకు ఆస్కారం ఉన్నప్పుడు కచ్చితంగా తమను తాము నిరూపించుకుని ముందుకు దూసుకెళ్లాల్సి ఉంటుంది.
పాత్రల ఎంపిక విషయంలో ప్రయోగాలు చేస్తే అవి ఒక్కోసారి కలిసి రాకపోవచ్చనే భ్రమ కొందరు ఆర్టిస్టుల్లో ఉంది. ముఖ్యంగా అందమైన హీరోయిన్‌లు తల్లి, భార్య పాత్రలు పోషిస్తే ఆ తర్వాత మళ్లీ మళ్లీ అవే పాత్రలు వెంటపడతాయనే అపప్రద ఉంది. నిజానికి ఈ తరహా ఔట్ డేటెడ్ థింకింగ్ ఒకప్పటి ప్రజల్లో ఉండేది. మూస ధోరణిలో ఆలోచించే మూర్ఖత్వం నేటితరంలో అసలు లేనే లేదు. టాలీవుడ్ .. బాలీవుడ్.. హాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అయినా.. కంటెంట్ లో వైవిధ్యం, కథ కమామీషు, విజువల్ గ్రాండియారిటీ వంటివి చూస్తున్నారు. తమకు తెలిసిన లేదా తమకు నచ్చిన నటుడు లేదా నటి అయితేనే సినిమా చూడాలని కూడా రూల్ అసలే పెట్టుకోవడం లేదు.