స్పీడ్ తగ్గిస్తానంటోన్న మీనాక్షి!
మీనాక్షి చౌదరి కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో అమ్మడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ భామగా మారుతోంది.
By: Tupaki Desk | 4 Jan 2025 10:30 AM GMTమీనాక్షి చౌదరి కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో అమ్మడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ భామగా మారుతోంది. ఈ ఏడాది `గుంటూరు కారం`, `లక్కీ భాస్కర్` తో భారీ విజయాలు అందుకుంది. దళపతి విజయ్ తో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లో స్క్రీన్ షేర్ చేసుకుంది. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన వరుణ్ తేజ్ `మట్కా`లోనూ నటించింది. `మెకానిక్ రాకీ`తోనూ మురిపించింది. `సింగపూర్ సెలూన్` అనే తమిళ సినిమాలోనూ కనిపించింది.
ఇలా ఏడాదంతా అమ్మడు సినిమాలతో సందడి చేసింది. ఇక కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా `సంక్రాంతి కి వస్తున్నాం`? అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఇందులో అమ్మడు వెంకటేష్ కి ప్రియురాలి పాత్రలో అలరించనుంది. అయితే ఇదే ఏడాది అమ్మడు కొన్ని మార్పులకు ఛాన్స్ ఇచ్చింది. ఇకపై సినిమాలు ఎడెపెడా చేయనని...నంబర్ కోసం కాకుండా మంచి కథలు మాత్రమే ఎంచుకుని పనిచేస్తానని తెలిపింది.
2024 ఒకే ఏడాది అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయని ఎప్పుడూ అనుకోలేదని..అదంతా దానంతటదే జరిగిపో యిందని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకూ ఎక్కువగా సినిమాలకే సమయం కేటాయించానని, ఇకపై కుటుంబం కోసం, తన కోసం ఎక్కువగా సమయం కేటాయించాలకుంటున్నట్లు తెలిపింది. మీనాక్షి కెరీర్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. తొలి సినిమా `ఇచట వాహనములు నిలుపరాదు`లో నటించింది.
ఆ సినిమా మంచి విజయం సాధించింది. అప్పుడే త్రివిక్రమ్ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత `హిట్ ది సెకెండ్ కేస్` తో మరో హిట్ పడింది. `ఖిలాడీ`తో వైఫల్యం ఎదురైనా మీనాక్షి జోరును ఆ ప్లాప్ ఆపలేకపోయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ అయింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో `అనగనగా ఒక రాజు`లో నటిస్తోంది. అలాగే మరో రెండు చిత్రాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి.