నా ఫిజిక్ ఫిట్‌కి రహస్యం ఇదే..!
అందులో లక్కీ భాస్కర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఇతర సినిమాల్లో కొన్ని పర్వాలేదు అనిపిస్తే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి
By: Tupaki Desk | 10 Dec 2024 12:30 AM GMTతెలుగు ప్రేక్షకులకు ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి మెల్లమెల్లగా టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని దూసుకు పోతుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాదిలో ఈమె నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో లక్కీ భాస్కర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఇతర సినిమాల్లో కొన్ని పర్వాలేదు అనిపిస్తే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఈ ఏడాదిలో వరుసగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు వచ్చే ఏడాదిలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. సన్నగా నాజూకుగా ఉండే ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడి ఫిట్‌నెస్ గురించి, ఫిజిక్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన యొక్క అందం, ముఖ్యంగా ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఎక్కువ శాతం మంది నా ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నా ఫిట్‌నెస్‌కి నూరు శాతం నా తండ్రి కారణం. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను ఆటల్లో ప్రోత్సహించారు. నా వెంట ఉండి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పించారు. అందుకే నేను స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్‌గా చాలా మ్యాచ్‌ల్లో ఆడాను అంది.
ఒక స్పోర్ట్స్ పర్సన్‌ని కనుక సహజంగానే నేను ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్లు ఎక్కువ చేసే దాన్ని, ఇప్పుడు కూడా అదే అలవాటుతో రెగ్యులర్‌గా తాను ఫిట్‌నెస్ కోసం తాను ఎక్కువగా వర్కౌట్‌లు చేస్తూ ఉంటాను అంది. అందుకే తాను ఇంత ఫిట్‌గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంక్రాంతి నుంచి ఈ అమ్మడి సందడి మొదలు పెట్టబోతుంది. వచ్చే ఏడాదిలో ఈ ఏడాది కంటే ఎక్కువ సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.