పిక్‌టాక్ : అందాల మీను కవర్ స్టిల్ చూశారా!
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది మరిన్ని పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 4 Feb 2025 12:30 PM GMT'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది మరిన్ని పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2025ను ఆరంభంలోనే బిగ్గెస్ట్ సక్సెస్‌తో ప్రారంభించింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించడంతో పాటు, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో జనాలు ఈ అమ్మడిని పట్టించుకోలేదు. కానీ లక్కీ భాస్కర్‌లో మంచి నటనతో పాటు, ఆ సినిమాకు హిట్ టాక్ దక్కడం వల్ల వరుసగా ఆఫర్లు దక్కాయి. లక్కీ భాస్కర్ సమయంలోనే మట్కా సినిమాతో ఫ్లాప్‌ని చవి చూసింది.
గత ఏడాది 'లక్కీ భాస్కర్' సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే రెండు పెద్ద విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఈ అమ్మడు మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అనగనగా ఒక రాజుతో మీనాక్షీ మరో విజయాన్ని తన ఖాతాలో ఇదే ఏడాది వేసుకునే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంతో ఈ అమ్మడి పారితోషికం అమాంతం పెరిగిందట.
సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా అందాల ఆరబోత ఫోటో షూట్స్‌తోనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ JFW కవర్ పేజ్‌పై పూజా హెగ్డే కన్నుల విందు చేసింది. స్టైలిష్ గాగుల్స్‌తో విభిన్నమైన ఔట్ ఫిట్‌తో క్లోజప్‌లో ఈ అమ్మడి అందాల ఆరబోత అదిరి పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు స్టైల్ ఐకాన్‌గా ఈ కవర్‌పై మీనాక్షి చౌదరి కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకోవడంతో జోరు మీదున్న ఈ అమ్మడికి ముందు ముందు ఇలాంటి స్పెషల్ కవర్ స్టిల్స్ మరిన్ని దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఎంజాయ్ చేస్తోంది. గత నెల రోజులుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే ఉంది. వెంకటేష్, మీనాక్షి చౌదరితో కలిసి తగ్గకుండా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా సినిమాలో ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంది. అందుకే మీనాక్షికి సైతం ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆకట్టుకునే అందంతో పాటు అలరించే నటన ప్రతిభ ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో ముందు ముందు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబుతో లీడ్ పెయిర్ కోసం, ప్రభాస్‌తో నటించడం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఈ అమ్మడు ఆమధ్య తన మనసులో మాట చెప్పుకొచ్చింది.