Begin typing your search above and press return to search.

చీరలో మీనాక్షి.. ఆ అంధమేంటి బాబోయ్

ఈ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 3:15 AM GMT
చీరలో మీనాక్షి.. ఆ అంధమేంటి బాబోయ్
X

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న నటి మెనాక్షి చౌదరి మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ సారి ఆమె వైలెట్ కలర్ చీరలో తన అందాన్ని, నవ్వును ప్రదర్శిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆమె చీరలో ఉన్న క్లాసిక్ లుక్ అభిమానులను అద్భుతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.


అందం, ప్రతిభ కలబోసుకున్న టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి, ప్రస్తుతం యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి, "ఇచ్చట వాహనములు నిలుపరాదు"తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, "ఖిలాడి", "హిట్ 2" వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో మరింత క్రేజీ ప్రాజెక్టుల్లో నటించనుంది.


ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే, "మెకానిక్ రాకీ," "విశ్వంభర," "లక్కీ భాస్కర్," మరియు "మట్కా" వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇందులో ఏదైనా ప్రాజెక్ట్ హిట్ అయితే, ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మీనాక్షి చౌదరి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోనూ తన సత్తా చాటాలని చూస్తోంది.


ఇటీవల విజయ్ హీరోగా నటించిన "GOAT" సినిమాలో స్పెషల్ పాత్రలో నటించింది. ఈ ప్రాజెక్ట్ భారీగా సక్సెస్ కాలేదు కానీ ఆమెకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా, మీనాక్షి ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఇక ఆమె అందాన్ని పొగుడుతూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల కాలంలో అమ్మడు ఇలా తన అందంతో భారీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.