Begin typing your search above and press return to search.

మ‌హేష్-విజ‌య్ లో ఒకే ర‌క‌మైన పోలిక‌లా?

మీనాక్షి చౌద‌రి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస అవ‌కాశాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 1:30 AM GMT
మ‌హేష్-విజ‌య్ లో ఒకే ర‌క‌మైన పోలిక‌లా?
X

మీనాక్షి చౌద‌రి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస అవ‌కాశాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తోంది. ఇవ‌న్నీ కోరుకుంటే వ‌చ్చిన అవ‌కాశాలు కాదు. అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాలే. ఈ విష‌యాన్ని తానెంతో ఓపెన్ గా షేర్ చేసింది. ఏదైనా స‌హ జంగా జ‌రగాలే త‌ప్ప‌! ప‌నిగ‌ట్టుకుని ప్ర‌య‌త్నిస్తే అన్నీ సాధ్యం కావు అంటోంది.

`గుంటూరు కారం`తో సూప‌ర్ స్టార్ మ‌హ‌ష్ తో న‌టించింది. తాజాగా రిలీజ్ అయిన `ది గోట్` తో త‌ల‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి పోలిక‌లు గ‌మ‌నిం చారంటే అమ్మ‌డు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. మ‌హేష్‌..విజ‌య్ మ‌ధ్య చాలా పోలిక‌లున్నాయి. ఇద్ద‌రు క్ర‌మ‌శిక్షణ క‌లిగిన న‌టులు. సెట్స్ లో అంద‌ర్నీ స‌మానంగా గౌర‌విస్తారు.

ఇద్ద‌రు ఎంతో పెద్ద స్టార్ హీరోలు. కానీ ఆ ఫీలింగ్ ఎక్క‌డా వాళ్ల‌లో క‌నిపించ‌దు. చాలా సింపుల్ గా ఉంటారు. అంద‌రితో స‌ర‌దాగా మాట్లాడుతారు. క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వాలు ఇద్ద‌రివి. ఆ రెండు సినిమా షూటింగ్ లు నాకు బెస్ట్ మెమోరీగా నిలిచి పోతాయి. అలాగే విజ‌య్ రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు ఆయ‌న చివ‌రి సినిమాలో నేను భాగం అవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

ఆయ‌న‌తో అవ‌కాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. నాకు తొంద‌ర‌గానే వ‌చ్చింది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతే ఆ ఛాన్స్ నాకొచ్చేది కాదు` అని తెలిపింది. ప్ర‌స్తుతం మీనాక్షి చౌద‌రి చేతిలో చాలా సినిమాలున్నాయి. గ‌త ఏడాది క‌మిట్ అయిన చిత్రాల‌న్నీ ఆనె సెట్స్ లో ఉన్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.