మీనాక్షి-శ్రద్దా బ్యూటీల ఇంట సంక్రాంతి ఇలా!
నిత్యం టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లు దిగుమతి అవుతూనే ఉంటారు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తెలుగు సంప్రదాయాల గురించి ఆయా భామలు ఎంతో చక్కగా తెలుసుకుంటారు.
By: Tupaki Desk | 14 Jan 2025 8:30 AM GMTసంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలు-తమిళనాడు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ. ఈ సీజన్ టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. సినిమా ఎలా ఉన్నా సంక్రాంతి మోజులో ఆడుతుందనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే సంక్రాంతికి ప్రత్యేకంగా సినిమాలు రిలీజ్ అయ్యేలా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసు కుంటారు. తెలుగు పండగలు ఇతర రాష్ట్రాల్లోనూ బాగా ఫేమస్ అవుతున్నాయి అంటే అందుకు కారణం ఆయా రాష్ట్రాల హీరోయిన్లు కూడా కీలక భాగస్వాములే.
నిత్యం టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లు దిగుమతి అవుతూనే ఉంటారు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తెలుగు సంప్రదాయాల గురించి ఆయా భామలు ఎంతో చక్కగా తెలుసుకుంటారు. తమ లోగిళ్లలో చెబుతుంటారు. తాజాగా హార్యానా బ్యూటీ మీనాక్షిచౌదరి, కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాద్ కూడా సంక్రాంతి అంటే తమ ఇళ్లలో కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ అన్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగానా హైదరాబాద్ లో చదువుకోవడంతో పాటు తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బధిలీ అయిన నేపథ్యంలో సంక్రాంతి తమ ఇంటి పండుగలా మారిపోయిందంది.
ఈరోజు శ్రద్దా ఇంట్లో ప్రత్యేకమైన వంటకం ఏంటంటే? కొబ్బరి ,బెల్లం కలిపి చేసే వంటకం పండుగ స్పెషల్ గా నిలుస్తుందంది. జనవరి లో తమ కుటుంబం ఏ రాష్ట్రంలో ఉన్న తప్పక సంక్రాంతి పండుగ నిర్వహించు కుంటామని తెలిపింది. ఈసారి ఇంకా స్పెషల్ గా వేడుక చేసుకుంటున్నామంది. తాను నటించిన `డాకు మహారాజ్` మంచి విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో వేడుక చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఇక మీనాక్షి సంక్రాంతిని ఉత్తరాదిన కూడా సెలబ్రేట్ చేసుకుంటారని తెలిపింది. అక్కడ `లోహ్రీ` పేరుతో ఈ వేడుక చేస్తారుట. పంటల కోతలకు గుర్తుగా ఈ పండుగ నిర్వహిస్తారని తెలిపింది. తెలుగు సినిమాల్లో నటించడం మొదలైన దగ్గర నుంచి ఇక్కడి పద్దతులు, పండగలు అన్నీ తెలుసుకుంటున్నానని పేర్కోంది.