Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోతో పెళ్లి.. మీనాక్షి ఏం చెప్పిందంటే?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లపై మీనాక్షి టీమ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Nov 2024 4:40 PM GMT
అక్కినేని హీరోతో పెళ్లి.. మీనాక్షి ఏం చెప్పిందంటే?
X

టాలీవుడ్ హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమాయణం సాగిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి, అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని, త్వరలోనే పెళ్లి తంతు కూడా ఉంటుందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లపై మీనాక్షి టీమ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వార్తల్లో ఎలాంటినిజం లేదని, సుశాంత్-మీనాక్షి మంచి ఫ్రెండ్స్ అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అక్కినేని హీరోతో పెళ్లి వార్తలపై తాజాగా మీనాక్షి చౌదరి కూడా స్పందించినట్లుగా మరో వార్త వినిపిస్తోంది. 'నేను సింగల్ గానే ఉన్నాను. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా రిలేషన్ షిప్స్ గురించి, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నెలలో కొత్త పుకారు పుట్టుకురావాడం కామన్ అయిపోయింద'ని మీనాక్షి చెప్పినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. హీరోయిన్ తో పెళ్లి వార్తలపై హీరో సుశాంత్ ఇప్పటి వరకూ స్పందించలేదు.

సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమాయణం సాగిస్తున్నారనే రూమర్స్ వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం.. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయడమే. 2021లో సుశాంత్ హీరోగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమా ద్వారా మీనాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. ముంబైలోని యాక్టింగ్ స్కూల్ లో సుశాంత్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నప్పడు.. అక్కడ మీనాక్షిని చూసి తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల 'అన్ స్టాపబుల్ 4' టాక్ షోలో మీనాక్షి వెల్లడించింది.

సినిమాల్లోకి రాకముందు మోడల్ కెరీర్ ను ఎంచుకున్న మీనాక్షి.. ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకుంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాతే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమా ప్లాప్ అయినా, తన అందంతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంది. ఇప్పుడు సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ ఏడాదిలో 'గుంటూరు కారం' 'ది గోట్' 'సింగపూర్ సెలూన్' 'లక్కీ భాస్కర్', 'మట్కా' వంటి ఐదు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది మీనాక్షి చౌదరి. మరికొన్ని రోజుల్లో 'మెకానిక్ రాకీ' అంటూ వస్తోంది ఆ తర్వాత సంక్రాంతి పండక్కి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అలరించడానికి రెడీ అవుతోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చలో దశలో ఉన్నాయి. ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ లక్కీ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు 'ఇచ్చట వాహనములు నిలపరాదు' తర్వాత సోలో హీరోగా మరో సినిమా చెయ్యలేదు సుశాంత్. 'రావణాసుర' 'భోళా శంకర్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు కానీ, రెండూ తన కెరీర్ కు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. అయితే సుశాంత్ - మీనాక్షి కలిసి చేసిన మూవీ ప్లాప్ అయినా, వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రం అలానే కొనసాగుతోందనే మాట వాస్తవం. వీళ్లు ప్రేమలో ఉన్నారా లేదా అనే సంగతి పక్కనపెడితే.. ఇద్దరూ తరచుగా కలుస్తుంటారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటుంటారు.