Begin typing your search above and press return to search.

మహేష్ వల్ల మరో ఛాన్స్ కొట్టేసింది!

మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో నటిగా ఎంపిక అయిన కారణంగానే దుల్కర్‌ సల్మాన్‌ సినిమాలో ఛాన్స్ ని దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:42 AM GMT
మహేష్ వల్ల మరో ఛాన్స్ కొట్టేసింది!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. మరో హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఎప్పుడైతే మహేష్ బాబు సినిమా లో నటించే ఛాన్స్‌ ను దక్కించుకుందో అప్పుడే ఈమె గురించి మాట్లాడుకోవడం మొదలు అయింది. వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. తెలుగు లో ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు నటించేందుకు సైన్ చేస్తుంది.

తాజాగా మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపిక అయింది. మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో నటిగా ఎంపిక అయిన కారణంగానే దుల్కర్‌ సల్మాన్‌ సినిమాలో ఛాన్స్ ని దక్కించుకుంది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలో మీనాక్షి చౌదరి నటించే అవకాశం దక్కించుకోవడం తో ముందు ముందు మరిన్ని తెలుగు మరియు ఇతర భాషల సినిమాల్లో నటించే ఛాన్స్ లను దక్కించుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి స్పీడ్ చూస్తూ ఉంటే రాబోయే రెండేళ్లలో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యేలా ఉంది.