Begin typing your search above and press return to search.

మీనాక్షి చౌద‌రి మ‌రోక‌టి ప‌ట్టేసిందా?

ఇందులో మొత్తం ముగ్గురు నాయిక‌లు అవ‌సరం ఉంది. దీంతో ఓ పాత్ర‌కి మీనాక్షి చౌద‌ర‌ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:45 AM GMT
మీనాక్షి చౌద‌రి మ‌రోక‌టి ప‌ట్టేసిందా?
X

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌద‌రి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మందన్న‌..పూజాహెగ్డే లాంటి భామ‌లు ముంబైలో తిష్ట వేయ‌డం..స‌మంత అమెరికాలో రిలాక్స్ అవ్వ‌డం తో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మీనాక్షి ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తుంది. వాళ్ల రేంజ్ లో పారితోషికం కూడా డిమాండ్ చేయ‌దు కాబ‌ట్టి! మీనాక్షి వైపు అంతా చూస్తున్నారు. అన్నింటిని మంచి మంచి పెర్పార్మ‌ర్ అని త్రివిక్ర‌మ్ లాంటి ఉద్దండులే స్టాప్ వేయ‌డంతో ద‌ర్శ‌కుడు మీనాక్షి పేరు చెప్ప‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా హీరో-నిర్మాత‌లు అంగీక‌రిస్తున్నారు.

'గుంటూరు కారం'లో మ‌హేష్ కి జోడీగా ఎంపిక చేయ‌డంతో అమ్మ‌డి పేరు మ‌రింత పాపుల‌ర్ అవుతుంది. ఇదే క్రేజ్ ని అమ్మ‌డు తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటుంది. చిన్న‌..పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు క‌మిట్ అవుతుంది. తాజాగా మీనాక్షి చౌద‌రి మ‌రో భారీ ప్రాజెక్ట్ లోనూ భాగం అవుతున్న‌ట్లు వినిపిస్తుంది. ప్ర‌స్తుతం న‌టసింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో మొత్తం ముగ్గురు నాయిక‌లు అవ‌సరం ఉంది. దీంతో ఓ పాత్ర‌కి మీనాక్షి చౌద‌ర‌ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో నాయిక‌గా ఊర్వ‌శి రౌతేలాని కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఊటీలో షూటింగ్ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో బాల‌య్య ..ఊర్వ‌శిల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. దీంతో ఊర్వ‌శి ఎంట్రీ క‌న్ప‌మ్ అయింది. మ‌రో నాయిక ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

అలాగే మీనాక్షి ఎంట్రీని మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది. ఈ ఛాన్స్ గనుక మీనాక్షి చౌద‌రి అందుకుంటే? అమ్మ‌డు స్టార్ లీగ్ లో చేరిన‌ట్లే. ఓవైపు 'గుంటూరు కారం'..మ‌రోవైపు బాల‌య్య సినిమాలో రొమాన్స్ చేస్తే! అంత‌కు మించిన గొప్ప ఐడెంటిటీ ఇంకేముంటుంది. ఆ రెండు విజ‌యాలు సాధిస్తే మీనాక్షి సైతం శ్రీలీల‌లా ట‌చ్ చేయ‌ని రేంజ్ కి చేరుకుంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.