Begin typing your search above and press return to search.

బ్లాక్‌ చీరలో మెరిసిన అందాల చౌదరి

తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోలతో కుర్రకారుకు మీనాక్షి మతి పోగొడుతుంది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 10:30 PM GMT
బ్లాక్‌ చీరలో మెరిసిన అందాల చౌదరి
X

తెలుగు ప్రేక్షకులకు మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు వంటి పెద్ద హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అంతే కాకుండా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ తో రొమాన్స్ చేసిన అరుదైన ఘనత సైతం దక్కించుకుంది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా షేర్‌ చేసే అందాల ఫోటో షూట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోలతో కుర్రకారుకు మీనాక్షి మతి పోగొడుతుంది.


2018 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి అందాల కిరీటంను సొంతం చేసుకుంది. మిస్‌ ఇండియాగా నిలిచిన మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో అడుగు పెట్టి మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులో ఈ అమ్మడు 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన మీనాక్షి చౌదరికి మాత్రం నటిగా మంచి గుర్తింపు దక్కింది. తన అందంతో ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలోనే త్రివిక్రమ్‌ తో ప్రశంసలు అందుకుని తప్పకుండా ఆఫర్‌ ఇస్తాను అనే హామీని తీసుకుంది.


కేవలం తెలుగు సినిమాలకు పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి తాజాగా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన బ్లాక్‌ చీర కట్టు ఫోటోలు నెటిజన్స్ చూపు తిప్పనివ్వడం లేదు. రెగ్యులర్‌గా మోడ్రన్‌ డ్రెస్‌ల్లో కనిపించి కన్నుల విందు చేసిన మీనాక్షి చౌదరి ఈసారి చీర కట్టులో కనిపించడం ద్వారా మరింత అందంగా కనిపించింది. మీనాక్షి ని చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదు అంటూ పలువురు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఫోటోలు లైక్ చేసి షేర్‌ చేస్తూ ఉన్నారు.


మీనాక్షి చౌదరి తాజాగా విజయ్ తో నటించిన దిగోట్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో కోలీవుడ్‌లో ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ముందు ముందు తమిళనాట ఈమె స్టార్‌ హీరోలతో పాటు, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేయడం ఖాయం. చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మీనాక్షి చౌదరి విషయంలో అదే జరగబోతుంది అనే అభిప్రాయంను ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.