Begin typing your search above and press return to search.

ఇప్పుడీ బ్యూటీకి ఉన్నంత డిమాండ్ ఇంకెవరికీ లేదు!

వారానికో కొత్త హీరోయిన్ పరిచమయ్యే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఏమంత ఈజీ కాదు.

By:  Tupaki Desk   |   26 July 2024 3:31 AM GMT
ఇప్పుడీ బ్యూటీకి ఉన్నంత డిమాండ్ ఇంకెవరికీ లేదు!
X

వారానికో కొత్త హీరోయిన్ పరిచమయ్యే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఏమంత ఈజీ కాదు. అందం అభినయంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వస్తేనే, కొన్నాళ్లపాటు అవకాశాలు అందుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ అందాల భామ మీనాక్షి చౌదరిని చూస్తుంటే, అన్నీ కలిసొచ్చినట్లుగా అనిపిస్తోంది. అమ్మడు ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అర డజను క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది.


ఈ ఏడాది ప్రారంభంలో 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరీ.. 'సింగపూర్ సెలూన్' అనే తమిళ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.

'లక్కీ భాస్కర్' సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటిస్తోంది మీనాక్షి చౌదరీ. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇది 'ది గోట్' మూవీ వచ్చిన రెండు రోజులకు సెప్టెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఇక 'మెకానిక్ రాకీ' అనే చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకి రానుంది.

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి కాంబోలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రంలోనూ మీనాక్షి నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర ఏంటనేది తెలియదు కానీ, కథలో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీని 2025 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'మట్కా' మూవీలోనూ మీనాక్షి హీరోయిన్ గా చేస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియడ్ డ్రామా వచ్చే ఏడాదే విడుదల అవుతుంది.

ఇటీవల విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'Venky Anil3' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరీ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీకి మాజీ ప్రేయసిగా, ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ మధ్యనే మీనాక్షి మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని రాబోయే సంక్రాంతికే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ ఆరు చిత్రాల్లో కొన్ని హిట్టయినా హర్యానా బ్యూటీ కెరీర్ మరింతగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.