Begin typing your search above and press return to search.

మీనాక్షికి అంత భయమెందుకు?

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   25 July 2024 5:09 PM GMT
మీనాక్షికి అంత భయమెందుకు?
X

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఇచట వాహనములు నిలుపరాదు మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో అలరించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలిగా కనిపించింది మీనాక్షి.

పల్లెటూరి అమ్మాయి రోల్ లో నటించిన ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పటికే కోలీవుడ్ లోకి కొలై మూవీతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. చేతి నిండా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, స్టార్ హీరో దళపతి విజయ్ గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్), మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాల్లో నటిస్తోంది మీనాక్షి చౌదరి.

వీటితోపాటు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా మూవీల్లో కూడా యాక్ట్ చేస్తోంది. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష కాంబినేషన్ లో రానున్న కొత్త మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు. అయితే తాను నటిస్తున్న వాటిలో లక్కీ భాస్కర్, గోట్ చిత్రాలు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 5వ తేదీన గోట్, 7వ తేదీన లక్కీ భాస్కర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ రెండు సినిమాలపై మంచి హోప్స్ పెట్టుకున్న మీనాక్షి.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించేందుకు సిద్ధమవుతున్న అమ్మడు.. తనకు చాలా భయంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం కంటిన్యూగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంటే ఆనందంగా ఉందని, కానీ మరోవైపు భయం కూడా అంతే రీతిలో ఉందని మీనాక్షి చౌదరి తెలిపింది.

ప్రస్తుతం మీనాక్షి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అమ్మడు నటిస్తున్న మెకానిక్ రాకీ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మట్కాతోపాటు అనిల్ రావిపూడి- వెంకటేష్ ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. ఇప్పటికే గుంటూరు కారంతో అలరించిన అమ్మడు.. మరి వరుస సినిమాలతో ఎలాంటి హిట్లు అందుకుంటుందో వేచి చూడాలి.