స్టార్స్ తో ఛాన్సుల పై మీనాక్షి మనసులో మాట!
హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. `గుంటూరు కారం` తర్వాత పుల్ బిజీ అయి పోయింది.
By: Tupaki Desk | 27 July 2024 3:30 PM GMTహర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. `గుంటూరు కారం` తర్వాత పుల్ బిజీ అయి పోయింది. ఒక్క సక్సెస్ అమ్మడిని ఏకంగా స్టార్ హీరోలకి ప్రమెట్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ ..టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. రెండు భాషల్లోనూ ఐదారు సినిమాల్లో నటిస్తోంది. మెగాస్టార్ `విశ్వంభర`లో సైతం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలే లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి సైతం ప్రమోట్ అయింది.
కోలీవుడ్ చిత్రం `డీడీరిటర్న్స్ -2` లో ఛాన్స్ అందుకుంది. మెయిన్ లీడ్ కి మీనాక్షినే ఎంపిక చేసారు. తలపతి విజయ్ తో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లోనూ నటిస్తోంది. ఇంకా అమ్మడు ఒకే చెప్పాలే గానీ నిర్మాతలంతా అడ్వాన్సు లివ్వడనికి రెడీగా ఉన్నారు. నటిగా ఇంత బిజీ అవుతుందని మీనాక్షి సైతం ఏనాడు ఊహించి ఉండదు. సెకెండ్ లీడ్ నుంచి ఫస్ట్ లీడ్ కి ప్రమోట్ అవ్వడం అన్నది అంత వీజీ కాదు. ట్యాలెంట్ తో పాటు లక్ కూడా కలిసొస్తేనే సాధ్యపడుతుంది.
ఆ విషయలో మీనాక్షి చౌదరి లక్కీ గాళ్ అనే అనాలి. తాజాగా ఓ ఇంటర్వూలో ఇలా బిజీ అవ్వడం వెనుక ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది. అవకాశాలన్నీ నేను దేవుడు వరంగానే భావిస్తాను.లక్కీగా వచ్చాయనే అంటాను. నేనిక్కడ ట్యాలెంట్ గురించి మట్లాడాను. అలా మాట్లాడాల్సి వస్తే నాకంటే ట్యాలెంటెడ్ బయట చాలా మంది ఉన్నారు. వాళ్లకు రాని అవకాశాలు నాకు వచ్చాయంటూ అందకు ట్యాలెంట్ కాదు. నాకివన్నీ లక్కీగా వచ్చిన అవకాశాలే` అంది.
దీంతో మీనాక్షి ఎంతో నిజాయితీగా విషయం చెప్పిందంటూ నెటి జనులు పొగిడేస్తున్నారు. నిజమే కదా...ట్యాలెంట్ ఎంతో మందికి ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశం రావడం అన్నది ముఖ్యం. అవకాశం వస్తే నిరూపించుకోవడానికి ఓ మార్గం కనిపిస్తుంది. మీనాక్షి అలా నిరూపించుకున్న నటి. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ ఆమె భవిష్యత్ ని ఊహించాడు. పెద్ద హీరోయిన్ అవుతుందని ఆనాడే చెప్పాడు. ఆయన చెప్పినట్లే అవకాశాలు అందుకుంటుంది. ఆయన తెరకెక్కించిన `గుంటూరు కారం`లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.