Begin typing your search above and press return to search.

వెంకీ మామ కోసం గుంటూరు బ్యూటీ...?

తాజాగా ఈ సినిమా కోసం మీనాక్షి చౌదరిని సంప్రదించారు అంటూ వార్తలు వస్తున్నాయి. మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ గా వెంకటేష్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట.

By:  Tupaki Desk   |   11 May 2024 2:30 AM GMT
వెంకీ మామ కోసం గుంటూరు బ్యూటీ...?
X

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొంది ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా కనిపించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూ వరుస సినిమా ఆఫర్లతో దూసుకు పోతుంది.

తెలుగు లో వరుణ్ తేజ్‌ మరియు విశ్వక్‌ సేన్‌ సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమా తర్వాత స్పీడ్‌ పెంచింది. ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త సినిమాలకు కమిట్‌ అవుతూనే ఉంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా కోసం మీనాక్షి చౌదరిని సంప్రదించారు అంటూ వార్తలు వస్తున్నాయి. మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ గా వెంకటేష్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట. మరి వెంకీకి జోడీగా మీనాక్షి నటించబోతుందా...? లేదంటే మరేదైనా పాత్రలో ఈమె కనిపించనుందా? అనేది తెలియాల్సి ఉంది.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో వెంకీ మామ సినిమాలో ఛాన్స్ వచ్చిన వెంటనే ఓకే చెప్పింది. భగవంత్‌ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన తరహా పాత్ర అయితే ఖచ్చితంగా మీనాక్షి చౌదరికి నటిగా మరింత గుర్తింపు రావడం ఖాయం.

ఇన్నాళ్లు చిన్న సినిమాల్లో, సెకండ్‌ హీరోయిన్‌ గా కనిపిస్తూ వచ్చిన మీనాక్షి చౌదరి ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాల్లో మరియు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లు ఈ అమ్మడికి అత్యంత కీలకం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ టైటిల్ విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకీ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.