Begin typing your search above and press return to search.

నెక్స్ట్ స్టార్ హీరోయిన్ కటౌట్..!

మీనాక్షి లుక్స్ చూసిన వారెవరైనా కచ్చితంగా స్టార్ మెటీరియల్ అనేస్తారు. సోషల్ మీడియాలో అమ్మడు షేర్ చేసే ఫోటోలతో మాత్రం ఫాలోవర్స్ తెగ డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 6:30 AM GMT
నెక్స్ట్ స్టార్ హీరోయిన్ కటౌట్..!
X

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి చిన్నగా టాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంటుంది. నటనతో పాటు తన ఫోటో షూట్స్ తో కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది మీనాక్షి అందుకే ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారంలో మరదలి పాత్ర చేసిందని ఆమె ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా ఆ సినిమా చేయడం అమ్మడికి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆ సినిమాలో చేయడం వల్ల మీనాక్షి అందరికీ తెలిసింది.

ఇక ఇప్పుడు అమ్మడు వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది. ఆల్రెడీ అమ్మడికి కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. దళపతి విజయ్ ది G.O.A.T సినిమాలో మీనాక్షి నటిస్తుంది. విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక తెలుగులో కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది మీనాక్షి. విశ్వక్ సే 10వ సినిమాలో అవకాశం అందుకున్న మీనాక్షి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.

ఆల్రెడీ వరుణ్ తేజ్ తో మట్కా చేస్తున్న మీనాక్షి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ లో నటించింది. ఈ సినిమాలతో మీనాక్షి తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. అంతేకాదు తెలుగులో సీనియర్ హీరోయిన్స్ అంతా వారి మార్క్ సినిమాలు చేస్తుండగా యువ హీరోయిన్స్ లో జోరు కొనసాగించే భామలు తగ్గిపోయారు. అలా చూస్తే దాదాపు వరుసగా నాలుగు సినిమాలతో మీనాక్షి టాలీవుడ్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా ప్లేస్ ఫిక్స్ చేసుకుంటుందని చెప్పొచ్చు.

మీనాక్షి లుక్స్ చూసిన వారెవరైనా కచ్చితంగా స్టార్ మెటీరియల్ అనేస్తారు. సోషల్ మీడియాలో అమ్మడు షేర్ చేసే ఫోటోలతో మాత్రం ఫాలోవర్స్ తెగ డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చు. చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి పాన్ ఇండియా హిట్ అందుకున్నా మీనాక్షికి టాలీవుడ్ లో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి మీనాక్షి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన నిలుస్తుందా తనకు వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటుందా అన్నది చూడాలి. అవకాశం అది చిన్నదా పెద్దదా అని కాదు వచ్చినప్పుడు సత్తా చాటితే ఆ తర్వాత తమకు రావాల్సిన ఛాన్సులు అవే వస్తాయని బలంగా నమ్మినట్టు ఉంది మీనాక్షి అందుకే అమ్మడికి వరుస టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తున్నారు.