Begin typing your search above and press return to search.

మీనాక్షి చౌదరి.. ఈ స్పిడేంటి పాప!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 10:30 AM GMT
మీనాక్షి చౌదరి.. ఈ స్పిడేంటి పాప!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు. జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే ఈ రేసులోకి దూసుకొస్తున్నారు. శ్రీలీల అందం, అభినయంతో పాటు మంచి డాన్స్ పెర్ఫార్మర్. దీంతో మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా ఆమె ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేదు. దీంతో ఇప్పుడు స్టార్ చైర్ కోసం జరుగుతున్న రేసులో వెనుకబడింది.

ఇచ్చట వాహనములు నిలుపరాదు.. సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమా అంతగా మెప్పించలేదు. తరువాత చేసిన హిట్ 2 మూవీ మంచి సక్సెస్ అయ్యింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇళయదళపతి విజయ్ కి జోడీగా GOAT అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

తెలుగులో దుల్కర్ సల్మాన్ కి జోడీగా లక్కీ భాస్కర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. లక్కీ భాస్కర్ మూవీపైన పాజిటివ్ వైబ్ ఉంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ కి జోడీగా చేసిన మెకానిక్ రాకీ మూవీ రాబోతోంది. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ విశ్వంభరలో ఓ కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ మూవీ కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలాగే వరుణ్ తేజ్ కి జోడీగా మట్కా మూవీలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది.

ఓవరాల్ గా చూసుకుంటే ఆమె ఖాతాలో ఆరు సినిమాలు ఉంటే అందులో 4 మూవీస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రాబోతుండటం విశేషం. ఇవి సక్సెస్ అయితే మీనాక్షి చౌదరి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ చైర్ లో కూర్చుంటుంది. అటు సీనియర్ హీరోలకి, ఇటు యంగ్ హీరోలకి సెట్ అయ్యే గ్లామర్ ఉండటంతో మీనాక్షి చౌదరికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.