Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి పై మీనా కుండ బద్దలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్‌ లో కూడా స్టార్‌ డం దక్కించుకున్న సీనియర్ హీరోయిన్‌ మీనా

By:  Tupaki Desk   |   4 Jan 2024 7:39 AM GMT
రెండో పెళ్లి పై మీనా కుండ బద్దలు..!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్‌ లో కూడా స్టార్‌ డం దక్కించుకున్న సీనియర్ హీరోయిన్‌ మీనా. హీరోయిన్‌ గా ఆఫర్లు తగ్గిన సమయంలో అందరు హీరోయిన్స్ మాదిరిగానే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిర పడింది. అయితే దురదృష్టవశాత్తు మీనా భర్త హఠాత్తుగా మృతి చెందారు.

భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతూ తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్న మీనా ను చాలా మంది రెండో పెళ్లి విషయమై ప్రశ్నిస్తున్నారట. తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఒక జర్నలిస్ట్‌ పదే పదే రెండో పెళ్లి విషయమై ప్రశ్నించడంతో మీనా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది.

తన జీవితంలో ఏది కూడా ముందస్తుగా ప్లాన్‌ చేసుకోలేదు అంది. కాలంతో పాటు నేను నడుచుకుంటూ వెళ్లాను. ప్రతి సారి నాకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో మరియు కెరీర్ లో విజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చాను అంది.

ఇప్పుడు రెండో పెళ్లి విషయమై చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఉద్దేశ్యం లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు నా దృష్టి మొత్తం కూడా నా కూతురు కి మంచి భవిష్యత్తు ఇవ్వడం. తనకు తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకోవడం.

నేను జీవితాంతం ఒంటరిగా ఉండి పోవాలని అనుకోవడం లేదు. అలా అని ఇప్పుడే తోడు కావాలని కోరుకోవడం లేదు అన్నట్లుగా మీనా క్లారిటీ ఇచ్చింది. అయితే మీనా కాలం ఎటు తీసుకు వెళ్తే అటు అన్నట్టుగా మొత్తం భారం భవిష్యత్తు పై వేసింది.

కూతురు పెద్ద అయ్యాక.. ఆ సమయంలో తనకు తగ్గ తోడు దొరికి, అతడితో మిగిలిన జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుంటే అప్పుడు ఆయన్ను పెళ్లి చేసుకుంటుందేమో అన్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. ఇక సినిమాల్లోకి కూడా మంచి పాత్రలతో వస్తే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా మీనా పేర్కొన్నారు.