ఏ ఇతర నటి కంగనలా చేయలేరు: మీరా చోప్రా
కంగనా రనౌత్ రాజకీయ రంగ ప్రవేశానికి నటి మీరా చోప్రా (పవన్ `బంగారం` ఫేం) తన మద్దతు తెలిపింది.
By: Tupaki Desk | 12 Oct 2024 3:00 AM GMTకంగనా రనౌత్ రాజకీయ రంగ ప్రవేశానికి నటి మీరా చోప్రా (పవన్ `బంగారం` ఫేం) తన మద్దతు తెలిపింది. కంగనాకు మంచి నాయకురాలి లక్షణాలు ఉన్నాయని మీరా అభిప్రాయపడ్డారు. కంగనా తన ముక్కుసూటి స్వభావం కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన పరాక్రమం, బలాన్ని ఇది హైలైట్ చేస్తుందని మీరా చోప్రా విశ్లేషించారు. హిమాచల్ ప్రదేశ్ ఎంపీగా బిజీగా ఉన్న కంగనా తన ఎమర్జెన్సీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
కంగనా రనౌత్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్, బాహాటంగా మాట్లాడే స్వభావంతో ఎల్లపుడూ హెడ్ టర్నర్ గా నిలిచింది. దశాబ్దంన్నర కెరీర్ లో బాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతురాలైన నటిగా స్థిరపడింది. రాజకీయాల్లో తొలి అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణం గురించి ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా మాట్లాడుతూ కంగనా రనౌత్ రాజకీయాలను సమర్థిస్తూ మాట్లాడింది. తాజా ఇంటర్వ్యూలో మీరా మాట్లాడుతూ... కంగనా వంటి యువతరం నాయకులకు రాజకీయ వ్యవహారాల్లో నిమగ్నమవ్వడానికి ఇది సరైన తరుణమని మీరా నొక్కి చెప్పారు. కంగనా ఇప్పటికీ రాజకీయ జీవితంలోని ఆరంభ కష్టాలను ఎదుర్కొంటున్నా కానీ, చివరికి సత్తా చాటుతుందని తాను నమ్ముతున్నట్లు మీరా అంది. యువకులు రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. కంగనాను చూడండి. ఆమె రాజకీయ ప్రవేశానికి ఇది ఉత్తమ సమయమని భావిస్తున్నట్టు మీరా పేర్కొంది. కంగనాపై తన అభిమానాన్ని మీరా దాచుకోలేదు. బాలీవుడ్ కెరీర్‌లో కంగన సుస్థిరమైన నటన, ఎనర్జీ గురించి ప్రశంసించింది.
నేను కంగనా వీరాభిమానిని. ఈ పరిశ్రమలో ఇంతకు ముందు ఏ ఇతర నటి కంగనలా చేయలేదని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించింది. బాలీవుడ్‌లో కంగనా ప్రయాణం సాంప్రదాయకంగానే ఉంది. దూకుడైన ఆలోచనలు, తీవ్రమైన స్వాతంత్య్ర పోరాటాలతో పాపులరైంది. కల్మషం లేకుండా సూటిగా మాట్లాడటం కంగనకు ఉన్న ప్రత్యేకత. చాలాసార్లు ఎదురుదెబ్బలు తిన్నా కానీ, కంగన ప్రత్యేకమైన విధానం పరిశ్రమలో తనకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని మీరా పేర్కొంది.
ఒక పోరాట యోధురాలు, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమె ఒంటరిగా ఉంది.. అలాగే ఆమె పని చేస్తోంది. కోయి నహీ కర్ పాయా ఆజ్ తక్ (ఎవరూ అన్నీ చేయలేకపోయారు... ఇది ఇప్పటి వరకు). ఈ వ్యక్తిత్వం కంగనాను తన తోటివారి నుండి వేరు చేస్తుంది.. అని వ్యాఖ్యానించింది. కంగనా ముక్కుసూటితనం సవాళ్లకు దారితీస్తుందని మీరా అంది. ఆమె దౌత్యవేత్త కాదు.. ఆమె మాట్లాడే ముందు ఆలోచించదు.. అందుకే ఆమె చాలా ఇబ్బందుల్లో పడింది! అని మీరా వివరించింది. కంగనా చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా ఈ లక్షణం సోషల్ మీడియాలో తరచుగా బహిరంగ క్షమాపణలకు దారితీసింది.
కంగన గొప్ప నటి .. దీనిని ఎవరూ కాదనలేరు. నటన ఆమెకు రాజకీయాల్లో సహాయపడుతుందా? అంటే.. రాజకీయాల్లో ఇంకా పేద అమ్మాయి.. తన తప్పుడు ప్రకటనల కారణంగా ప్రతి 10 రోజులకు ఒకసారి ట్విట్టర్‌లో క్షమాపణలు చెబుతోంది! అని మీరా అన్నారు. ఈ అడ్డంకులు ఎన్ని ఉన్నాకానీ, నాయకురాలిగా కంగనా ఎదుగుదలపై మీరా ఆశాజనకంగానే ఉంది. రాజకీయాల్లో ఆరంభ సమస్యలను ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను... కానీ కంగనలో లక్షణాలను పరిశీలిస్తే, ఒక పోరాట యోధురాలు.. ఆమె ప్రాణాలతో బయటపడింది.. ఆమె చాలా బలంగా ఉంది! అని మీరా నొక్కిచెప్పారు. సమర్థవంతమైన నాయకత్వానికి ఈ లక్షణాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ లక్షణాలన్నీ లీడర్‌లో ఉండాలని నేను భావిస్తున్నాను. ఆమె మంచి నాయకురాలిగా ఉంటుందని నేను భావిస్తున్నాను అని మీరా ముగించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి ఎంపీగా తన డ్యూటీలో బిజీగా ఉండటమే కాకుండా, కంగనా తన సినిమా ఎమర్జెన్సీని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.