Begin typing your search above and press return to search.

మెగా vs అల్లు.. మెగాస్టార్ ముందే చెప్పారుగా..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా మెగా వెర్సస్ అల్లు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 7:30 AM GMT
మెగా vs అల్లు.. మెగాస్టార్ ముందే చెప్పారుగా..
X

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా మెగా వెర్సస్ అల్లు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వివాదాలు చాలా సందర్భాలలో మీడియాలో వచ్చాయి. చాలా సార్లు మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయిన కూడా ప్రతి సారి ఈ వివాదాలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ వార్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ అయిపొయింది.

ప్రొఫెషనల్ గా హీరోలు అందరూ ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఎవరి ఇష్టాలు వారికుంటాయి. అయితే అభిమానులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తోనే మిగిలిన హీరోలు అందరూ కూడా ఎదిగారు కాబట్టి ఆ మెగాహీరో అనే బ్రాండ్ నుంచి బయటకి రాకూడదని భావిస్తారు. అయితే అల్లు అర్జున్ మెగా బ్రాండ్ కి దూరంగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. బన్నీ ఆర్మీ అంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు.

మెగా ఫ్యాన్స్ లో బన్నీని అభిమానించే వారు ఉంటారు. అలాగే చరణ్ ని ఇష్టపడేవారు ఉంటారు. ప్రొఫెషనల్ గా వచ్చేసరికి వారి మధ్య పోటీ ఉండటం సహజం. ఎవరికి వారు సొంతంగా ఎదగడంలో ఎలాంటి తప్పులేదని మెగాస్టార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మెగా, అల్లు వివాదంపై ఇంటర్వ్యూలో చిరంజీవిని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి సినిమా ఈవెంట్ లో నా పేరు స్తుస్థిస్తూ ఉంటే వినేవారికి కూడా చిరాకు వస్తుంది.

అలా కాకుండా ఎవరికి వారుగా సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే నేను కూడా సంతోషిస్తాను. ప్రతి ఫంక్షన్ లో నా పేరు చెప్పాలని నేను కోరుకోను. ప్రొఫెషనల్ గా సొంత ఇమేజ్ తో ఎదుగుతున్నంత మాత్రాన మా మధ్య అనుబంధం లేదని కాదు. మా రెండు కుటుంబాల మధ్య ఎప్పటికి మంచి బాండింగ్ ఉంటుంది. ప్రతి సందర్భంలో అది కనిపించకపోవచ్చు. ఎవరికి వారు వ్యక్తిగతగత ఇమేజ్ పెంచుకునే అవకాశం వారికుంటుంది అని ఇంటర్వ్యూలో చెప్పారు.

అల్లు అర్జున్ ని ఒక వర్గం మెగా ఫ్యాన్స్, అలాగే జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ, విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో చిరంజీవి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకి కోట్ చేస్తూ బన్నీకి సపోర్ట్ గా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ కెరియర్ లో వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ ని ఎందుకు తప్పు పడుతున్నారు. నచ్చింది చేసుకునే హక్కు అతనికుంది అని ఫ్యాన్స్ సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.