మెగా కజిన్స్ న్యూ ఇయర్ సెల్రేషన్స్ ఇలా!
సిస్టర్స్ గ్యాంగ్ అంతా నేలపై కుర్చుని ఓ ఫోటో కనిపిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 2 Jan 2025 4:04 AM GMTమెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పండగొచ్చిందంటే? మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మెగా కజిన్స్ అంతా ఒక్కటయ్యారు. భార్యాభర్తలు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, సిస్టర్స్ నిహారిక, సుస్మిత, శ్రీజ ఈసారి కొత్త సంవంత్సరం వేడుకలు సంథింగ్ స్పెషల్ గా ఎంజాయ్ చేసారు. సెలబ్రిటీలంతా విదేశాల్లో బుర్జు కలీఫా ఎత్తైన టవర్ వద్ద, పబ్ ల్లో ఎంజాయ్ చేస్తే తాము డిఫరెంట్ అని ప్రూవ్ చేసారు.
మెగా కజిన్స్ అంతా మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులంతా అడవి అంతా జీపులో తిరిగి జంతు వుల్ని అతి దగ్గరగా చూసి ఆస్వాదిస్తున్నారు. సిస్టర్స్ అంతా ఓ గ్యాంగ్ లా ఉంటే? వరుణ్ -లావణ్య ఒక్కటిగా చుట్టేస్తున్నారు.
అడవి అంతా తిరిగి లావణ్య త్రిపాఠి అలసి సొలసి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుటుంటుంది. సిస్టర్స్ గ్యాంగ్ అంతా నేలపై కుర్చుని ఓ ఫోటో కనిపిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ పోనీ టెయిల్ లుక్ లో కనిపిస్తున్నాడు. వరుణ్ కొత్త సినిమా కోసం హెయిర్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
గత ఏడాది భారీ అంచనాల మధ్య 'మట్కా'తో వరుణ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం. కానీ ఆ సినిమా అంచనాలు అందు కోవడంలో విఫలమైంది. దీంతో గాంధీ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నాడు.