Begin typing your search above and press return to search.

ఎవరెన్ని అంటున్నా బన్నీ మాత్రం.. నచ్చిన దారిలోనే..

ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు రెండు ఫ్యామిలీల మధ్య ఏమైనా జరిగిందా? అంటే ఎవరూ స్పందించడం లేదు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:30 PM GMT
ఎవరెన్ని అంటున్నా బన్నీ మాత్రం.. నచ్చిన దారిలోనే..
X

థాంక్యూ మై డియర్ బన్నీ! అని రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పెట్టిన రిప్లై గుర్తుందా? ఇటీవల చిరు దేవుడి గదిలో అల్లు లెజెండ్ రామలింగయ్య ఫోటో కనిపిస్తున్న వైరల్ పిక్ గుర్తుందా? వీటిని బట్టి చూస్తే.. మెగా, అల్లు కుటుంబాలు రెండూ ఒకటేనని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా దూషించుకుంటున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు రెండు ఫ్యామిలీల మధ్య ఏమైనా జరిగిందా? అంటే ఎవరూ స్పందించడం లేదు.

అయితే ఎప్పటి నుంచో మెగా, అల్లు కుటుంబాల మధ్య వైరం ఉందని వార్తలు వస్తున్నాయి. పలుమార్లు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో మెగా ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసి నిందలు వేశారు. ఆ తర్వాత పవన్ గెలిచాక అల్లు అర్జున్ విష్ చేయలేదు. కానీ అల్లు అరవింద్ మాత్రం.. దర్శకులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక బన్నీ.. రీసెంట్ గా మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ఈవెంట్ లో తనకు నచ్చితే వస్తానంటూ కామెంట్స్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్.. పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఊహించి వివిధ రకాలుగా నెట్టింట కామెంట్లు పెట్టారు. అల్లు అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ బన్నీ వాటిపై నేరుగా స్పందించలేదు. చెప్పాలంటే.. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చిరంజీవి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఏ విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.

మెగా కాంపౌండ్ నుండి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. చిరును ఎప్పుడూ అవమానించలేదు. కొన్నేళ్ల క్రితం పవన్ విషయంలో మాత్రమే చెప్పను బ్రదర్ అని అన్నారు. అందుకు కారణాన్ని ఓసారి వివరించారు. మొన్న చేసిన వ్యాఖ్యలతో చిరుకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నంద్యాల వెళ్తే రచ్చ రచ్చ చేశారు. అయితే తానెందుకు నంద్యాల వచ్చానో క్లారిటీ ఇచ్చారు బన్నీ. తన స్నేహితుడు కాబట్టి వచ్చానని చెప్పినా మెగా ఫ్యాన్స్ వినలేదు.

అయితే ఒకింట్లో నలుగురు ఉంటే.. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, అభిరుచి ఉంటాయి.. అలాంటిది అల్లు అర్జున్ వైసీపీకి ఎలాంటి మద్దతు పలకకుండా.. స్నేహితుడి ఇంటికి వెళ్తే తప్పేంటి అన్ని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా నాగబాబు ట్వీట్ పెట్టి డిలీట్ చేయడం, మళ్లీ యాక్టివేట్ చేయడం వంటి పనులు చేశారని చెబుతున్నారు. రీసెంట్ గా పవన్ కూడా హీరోలు స్మగ్లర్ వంటి పాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అది పుష్ప మూవీపై పరోక్షంగా పవన్ డైలాగ్ వేసినట్లు చెబుతున్నారు.

ఏదేమైనా.. అల్లు అర్జున్ ఇప్పటి వరకు నేరుగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిపై కామెంట్స్ చేయలేదు. తనకు నచ్చింది చేసుకుంటూ వెళుతున్నారు. చిరుకు ఎలా, ఎప్పుడు గౌరవం ఇవ్వాలో ఇస్తున్నారు. చిరు ఇంట జరిగిన వేడుకలకు హాజరవుతున్నారు. వివిధ సందర్భాల్లో విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా స్పందించడం లేదు.

కానీ నెట్టింట రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య వార్ ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఇప్పుడు కామన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జోరుగా స్పందిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఆ రోజు ఆ ఒక్క ట్వీట్ పెట్టకపోయి ఉంటే ఇంత మాటల యుద్ధం జరిగి ఉండేది కాదని కొందరు చెబుతున్నారు. స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుందని, కాబట్టి బన్నీ కూడా అందుకే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటారని అంటున్నారు.

సాధారణంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఎంతో హుందా ఉంటారని అందరూ చెబుతుంటారు. ఇప్పుడు ఆ హుందాతనం మళ్లీ బన్నీ లో కనిపిస్తుందని చెబుతున్నారు. ఎవరికీ ఏం అనకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారని కొనియాడుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను ఆపాలని కోరుతున్నారు. ఇప్పటికైనా నాగబాబు.. పెద్దగా బాధ్యతలు తీసుకుని ఇష్యూ క్లియర్ చేయాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. లేకుంటే పరిస్థితులు శరవేగంగా మారుతాయని సూచిస్తున్నారు.