Begin typing your search above and press return to search.

ఆ సీక్వెళ్ల కోసం మెగా ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు!

నిజానికి ఏళ్ల త‌ర‌బ‌డి మెగాభిమానులు ఈ రెండు సీక్వెల్స్ కోసం వేచి చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:08 AM GMT
ఆ సీక్వెళ్ల కోసం మెగా ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు!
X

అవును.. మెగా ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టించాల్సిన ఆ రెండు సీక్వెల్ సినిమాల‌ గురించి వారంతా ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూస్తున్నారు. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్.. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఇంద్ర' సినిమాల సీక్వెళ్ల‌ కోసం మెగాభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

నిజానికి ఏళ్ల త‌ర‌బ‌డి మెగాభిమానులు ఈ రెండు సీక్వెల్స్ కోసం వేచి చూస్తున్నారు. మెగా నిర్మాత అశ్వ‌నిదత్ స్వ‌యంగా `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ ని తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఇంత‌కుముందు ఈ సీక్వెల్ సినిమా స్క్రిప్టు రెడీ అవుతుంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో మెగాభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యారు.. కానీ ద‌త్ నుంచి ఆ త‌ర్వాత ప్రారంభోత్స‌వానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క‌పోవ‌డంతో నిరాశ చెందారు. ఇటీవ‌ల ఇంద్ర రీరిలీజ్ సంద‌ర్భంగాను అశ్వ‌నిద‌త్ మ‌రోసారి జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి స‌హా ఇంద్ర సినిమాకి సీక్వెల్ తీస్తామ‌ని వెల్ల‌డించ‌డం ఉత్కంఠ క‌లిగించింది.

అశ్విని దత్ `కల్కి 2898 AD` సాధించిన అఖండ విజ‌యంతో స్ఫూర్తి పొంది, తన బ్యానర్‌లో మరిన్ని సినిమాలను ప్లాన్ చేస్తున్నారనేది వాస్త‌వం. చిరు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇంద్ర- జ‌గదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలకు సీక్వెల్‌లను నిర్మిస్తానని దత్ వాగ్దానం చేశారు. చాలా సీక్వెల్స్ కోసం తన వద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న ఇలా అన్నారు. ``తప్పకుండా త్వరలో ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలకు సీక్వెల్స్ నిర్మిస్తాను. కల్కి 2898 AD రెండవ భాగం త్వరలో ప్రారంభం కానుంది``అని చెప్పారు. అందువల్ల ఈ మూడు సీక్వెల్స్ స‌ర్వ‌త్రా ఫ్యాన్స్ లో ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి. ఇంద్ర, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్స్ కోసం మెగాభిమానులు ఆత్రంగా వేచి చూస్తుంటే, క‌ల్కి సీక్వెల్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అనే ఆస‌క్తి ప్ర‌భాస్ అభిమానుల్లో మెండుగా ఉంది.

ఈసారి ప్ర‌క‌ట‌న‌ల‌కు ప‌రిమితం కాకుండా అశ్వినిద‌త్ వెంట‌నే `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ ని ప్రారంభించి అటుపై ఇంద్ర సీక్వెల్ గురించి కూడా వేగంగా శుభ‌వార్త‌ చెబుతార‌ని మెగాభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. ఇక క‌ల్కి 2989ఏడి సీక్వెల్ స్క్రిప్టు పై నాగ్ అశ్విన్ ప‌ని చేస్తున్నార‌ని తెలుసుకున్న ప్ర‌భాస్ అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఆ మూడు సీక్వెల్స్ అశ్వ‌నిద‌త్ కెరీర్ స్పాన్ లో బెస్ట్ గా నిలిచేందుకు అవ‌కాశం ఉంది.