Begin typing your search above and press return to search.

మెగా, సూపర్ స్టార్ అభిమానులకి నిరాశే

ఇదిలా ఉంటే వచ్చే దసరా సందర్భంగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 5:19 AM GMT
మెగా, సూపర్ స్టార్ అభిమానులకి నిరాశే
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చెర్రి గేమ్ చేంజర్ రిలీజ్ పై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే వచ్చే దసరా సందర్భంగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు. అలాగే గేమ్ చేంజర్ మూవీ నుంచి కూడా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందని గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. దసరా ఫెస్టివల్ ట్రీట్ గా ఈ రెండు సినిమాల నుంచి బ్లాస్టింగ్ అయ్యే సాంగ్స్ వస్తే వినాలని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఊహించని విధంగా ఈ రెండు సినిమాల నుంచి దసరా సందర్భంగా ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తోన్న కూడా దసరాకి మాత్రం ఉండే అవకాశం లేదంట. ఎందుకు ఆగుతుందో అనేది మాత్రం క్లారిటీ లేదు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఇప్పట్లో లేదు కాబట్టి సాంగ్స్ రిలీజ్ ఇంత తొందరగా చేయడం కరెక్ట్ కాదని ఆగిపోయారంట.

దీంతో ఈ రెండు సినిమాల నుంచి మహా అయితే దసరా శుభాకాంక్షలు పోస్టర్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సాంగ్స్ కి మాత్రం స్కోప్ లేదంట. ఓ విధంగా అభిమానులని ఈ వార్త తీవ్ర నిరాశకి గురిచేస్తోందని చెప్పాలి. ఈ దసరాకి ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటూ సినీ అభిమానులు కాలక్షేపం చేయాల్సిందే.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి శంకర్ సిద్ధం అవుతున్నారు. గుంటూరు కారం రిలీజ్ కి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో త్రివిక్రమ్ కూడా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.